Movie News

చివరి పరీక్షలో గెలిచి తీరాల్సిందే

షూటింగ్ టైంలో ఎన్నో ప్రమాదాలు, అవాంతరాలు ఎదురుకున్న కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ కు రిలీజ్ టైంలోనూ పరీక్షలు తప్పడం లేదు. టికెట్ ధరల పెంపు ఆశిస్తే తెలంగాణలో నిరాశ ఎదురయ్యింది. ఏపీలో ధారాళంగా ఇచ్చేశారు కానీ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఓజి టైంలో బెంగళూరులో జరిగిన గొడవ, హైదరాబాద్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడ్డం లాంటివి వివాదాలకు దారి తీసి సినిమా మీద హైప్ ని అనవసరంగా డైవర్ట్ చేశాయి. ముందు రోజు రాత్రే వేద్దామనుకుని పర్మిషన్లు కూడా తీసుకున్న ప్రీమియర్లు హఠాత్తుగా క్యాన్సిల్ చేశారు. రేపు ఉదయం నుంచి షోలు ప్రారంభం కాబోతున్నాయి.

ట్రైలర్ ఎఫెక్టో మరేదైనా కారణమో చెప్పలేం కానీ కాంతార చాప్టర్ 1 మీద ఉండాల్సిన బజ్ అయితే అఫ్ లైన్, సోషల్ మీడియాలో కనిపించడం లేదు. నిర్మాతలు కంటెంట్ మీద చాలా ధీమాగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల హక్కులు ఎక్కువ ధరకు అమ్మినప్పటికీ ఖచ్చితంగా వెనక్కు వస్తుందనే నమ్మకంతో రిటర్నబుల్ అడ్వాన్స్ మీద రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. ఓజి బ్లాక్ బస్టర్ కావడంతో నైజాంలో తగినన్ని థియేటర్లు దొరకడం లేదని ట్రేడ్ టాక్. రెండో వారంలో తగ్గింపు రేట్లతో దాన్ని ప్రదర్శించడానికే అధిక శాతం ఎగ్జిబిటర్లు మొగ్గు చూపుతున్నారట. ఇది కొంచెం ఆందోళన కలిగించేదే.

ఇన్ని పరీక్షలు దాటుకుని వస్తున్న కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ కు ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టం. ఎందుకంటే ఏపీలో 100, 75 రూపాయలు పెంపు తీసుకున్నారు కాబట్టి సినిమా అదిరిపోయిందని వినిపిస్తే తప్ప జనాలు థియేటర్లకు రారు. దసరా సెలవులు ఇంకో నాలుగు రోజుల్లో అయిపోతాయి. స్కూళ్ళు, కాలేజీలు తీస్తారు. ఈలోగా మాగ్జిమం రాబట్టేయాలి. వీకెండ్ ఉంది కానీ ముందు ఓపెనింగ్స్ బలంగా వస్తే బయ్యర్లకు నమ్మకం కలిగి స్క్రీన్లు పెంచే ప్రయత్నం చేస్తారు. మిరాయ్ లాగా టాక్ వస్తే ఇలాంటి ఫాంటసీ డ్రామాలు గట్టిగా నిలదొక్కుకుంటాయి. చూడాలి మరి ఫస్ట్ పార్ట్ మేజిక్ రిపీట్ అవుతుందో లేదో.

This post was last modified on October 1, 2025 11:22 am

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

40 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago