తెలుగమ్మాయిలు తెలుగులో గుర్తింపు సంపాదించడమే కష్టం అంటే.. బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి రేంజికి వెళ్లింది శోభిత ధూళిపాళ్ల. ఇంటగెలిచి రచ్చ గెలవాలి అంటారు కానీ.. ఆమె రచ్చ గెలిచి ఇంటికి వచ్చింది. తన సినిమా కెరీర్ లాగే వ్యక్తిగత జీవితం కూడా ఎవ్వరూ ఊహించని టర్న్ తీసుకుంది. సమంత నుంచి విడిపోయిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య.. శోభితతో డేటింగ్ చేసి తర్వాత ఆమెను పెళ్లాడాడు. గత ఏడాది వీరి పెళ్లి సింపుల్‌గా జరిగింది.
పెళ్లి తర్వాత శోభిత ఫిలిం కెరీర్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. కొత్త సినిమాలు, సిరీస్‌లు ఏవీ ఒప్పుకోలేదు. గ్యాప్ పెరుగుతుండడంతో ఇక ఆమె సినిమాలు మానేస్తుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ శోభిత ఇప్పుడు కొత్త సినిమాను అంగీకరించింది. అది తమిళంలో, ఒక విలక్షణ దర్శకుడితో కావడం విశేషం. ‘అట్టకత్తి’తో మొదలుపెట్టి ‘తంగలాన్’ వరకు వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా బలమైన ముద్ర వేసిన పా.రంజిత్ దర్శకత్వంలో శోభిత నటిస్తోంది.
‘వెట్టువమ్’ పేరుతో రంజిత్ తీస్తున్న కొత్త చిత్రంలో ఆమె కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఆర్య, వీఆర్ దినేష్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. హీరోలతో సమానమైన పవర్ ఫుల్ రోల్‌లో శోభిత నటిస్తోందట. సమాజంలో అణగారిన వర్గాలకు సంబంధించి సామాజిక అంశాలతో సినిమాలు తీసే పా.రంజిత్ తన శైలికి భిన్నంగా.. ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. వచ్చే ఏడాది వేసవిలో ‘వెట్టువమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
This post was last modified on September 30, 2025 6:12 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…