ఉప్పెన రూపంలో డెబ్యూతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చూసిన హీరోయిన్ కృతి శెట్టికి ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజుతో డీసెంట్ హిట్లు దక్కేసరికి అమ్మడికి టాలీవుడ్ లో తిరుగులేదని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత మొత్తం రివర్స్ అయ్యింది. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు ఫ్లాపులు ఆమె కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, కస్టడీ, మనమే ఒకదాన్ని మించి మరొకటి ఆయా హీరోల కెరీర్ లోనే బెస్ట్ డిజాస్టర్స్ అయ్యాయి. మలయాళంలో చేసిన ఏఆర్ఎం ఒకటే కొంచెం ఊరట కలిగించింది. ఇదంతా ఇప్పటిదాకా జరిగిన గతం.
అదేంటో కానీ కృతి శెట్టికో విచిత్రమైన సమస్య వచ్చింది. ప్రస్తుతం తను తమిళంలో మూడు సినిమాల్లో ఉంది. కానీ అన్నీ సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉంటూ వాయిదాల పర్వంలో నలుగుతున్నాయి. కార్తీ వా వాతియర్ ఎప్పుడు రిలీజవుతుందో నిర్మాతకే అంతు చిక్కడం లేదు. షూటింగ్ అయిపోయిందని అన్నారు. గత ఏడాదే టీజర్ వచ్చింది. తర్వాత సైలెంట్ అయ్యారు. ప్రదీప్ రంగనాధన్ తో చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అదిగో ఇదిగో అంటూ ఇప్పుడేమో దీపావళికి ప్లాన్ చేశారు. కానీ ప్రదీప్ నటించిన మరో మూవీ డ్యూడ్ కూడా అదే పండక్కు ఉండటంతో మొదటిది పోస్ట్ పోన్ కావొచ్చనే ప్రచారం చెన్నై వర్గాల్లో ఉంది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సైతం ఏడాదిన్నరకు పైగా ప్రొడక్షన్ లో ఉంది. ఎస్ జె సూర్య ఒక ముఖ్య పాత్ర పోషించగా నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. జయం రవితో చేసిన జీనీ కూడా డిలేల వల్ల ఇబ్బందులు ఎదురుకుంటోంది. ఇలా విడుదలైనవి ఫ్లాప్ అవుతూ నమ్మకం పెట్టుకున్నవి లేట్ అవుతూ కృతి శెట్టి పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. వరసగా హిట్లు పడి ఉంటే శ్రీలీల, రష్మిక మందన్నలతో పోటీ పడే సీన్ ఉండేది. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. ఏదో ఈ మూడింటిలో కనీసం రెండు సక్సెస్ అయితే కోలీవుడ్ లోనే చక్కగా సెటిలవ్వొచ్చనే ప్లాన్ లో ఉంది ఉప్పెన భామ. చూడాలి ఏం చేస్తుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates