ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కి ఇమ్రాన్ హష్మీ ఎంతటి రొమాంటిక్ వీరుడో అవగాహన ఉండకపోవచ్చు కానీ ఓజిలో విలన్ గా నటించడం వల్ల అందరికీ కనెక్ట్ అయిపోతున్నాడు. అలాని ప్రతినాయకుడిగా నటించడం తనకు కొత్తేమి కాదు. టైగర్ 3లో సల్మాన్ ఖాన్ ని ఢీ కొనే పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశాడు కానీ అది ఆడకపోవడం వల్ల అంతగా పేరు రాలేదు. కానీ ఓజి మేనియా చూస్తుంటే అతని మైండ్ బ్లాంక్ అవుతోంది. మొన్న జరిగిన హైదరాబాద్ ఈవెంట్ కు వచ్చిన అభిమాన సందోహాన్ని చూసి షాక్ తిన్నాడు. తన మనసులో మాటలు పంచుకోవాలని ప్రిపేరయ్యి వచ్చాడు కానీ వర్షం వల్ల దాన్ని వినే ఛాన్స్ ఫ్యాన్స్ కి దక్కలేదు.
ఇదిలా ఉండగా ఇమ్రాన్ హష్మీ ఒకపక్క విలన్ గా నటిస్తూనే ఇంకో పక్క హీరోగా చేస్తుంటాడు. ఆ మధ్య గ్రౌండ్ జీరో అనే మూవీలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినా కంటెంట్ వీక్ గా ఉండటం వల్ల జనాలకు రీచ్ కాలేదు. అయితే నవంబర్ 7 విడుదల కాబోతున్న హక్ అనే సినిమా ఆసక్తి రేపేలా ఉంది. 1985లో జరిగిన ఒక చారిత్రాత్మక కోర్టు తీర్పు ఆధారంగా రూపొందిన హక్ లో ఇమ్రాన్ న్యాయం కోసం పోరాడే లాయర్ గా కనిపించనున్నాడు. షా బానో బేగం అనే మహిళ ముస్లిం చట్టాల ముసుగులో తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా కోర్టులో పోరాడి గెలుస్తుంది. అన్యాయంగా విడాకులు ఇచ్చిన భర్తకు బుద్ది చెబుతుంది.
షా బానో కేస్ గా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ జడ్జ్ మెంట్ ఎందరో స్త్రీలకు రక్షణ కవచంలా నిలబడింది. అప్పటి ప్రభుత్వాల వివక్ష పూరిత విధానాలను ఎండగట్టింది. షా బానోగా యామీ గౌతమ్ నటించగా ఆమె తరఫున వకీల్ గా ఇమ్రాన్ హాష్మి చేశాడు. వెంకటేష్ రానా నాయుడు డైరెక్టర్ సుపర్న్ వర్మ దర్శకత్వం వహించిన ఈ కోర్ట్ డ్రామా టీజర్ తోనే ఆసక్తి రేపేలా ఉంది. మాములుగా మైనారిటీ కేసుల మీద సినిమాలు తీసేవాళ్ళు తక్కువ. అందులోనూ ఇలాంటి కాంట్రావర్సిలు ఉంటే ఎక్కువగా ఆలోచిస్తారు. మరి హక్ కనక దాన్ని బ్రేక్ చేసి కొత్త ట్రెండ్ సృష్టిస్తుందేమో చూడాలి.
This post was last modified on September 23, 2025 11:57 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…