అక్టోబర్ 2 విడుదల కాబోతున్న కాంతార చాప్టర్ 1 ది లెజెండ్ చేతిలో ఇంకో పన్నెండు రోజులు మాత్రమే ఉన్నా ప్రమోషన్లు ఊపందుకోకపోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోనీ వాయిదా ఏమైనా ఉందా అంటే ఆ డౌట్ అక్కర్లేదనేలా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. కర్ణాటకలో టికెట్ రేట్లను గరిష్టంగా 200 రూపాయలకు పరిమితం చేయడం గురించి కోర్టుకు వెళ్లిన హోంబాలే ఫిలిమ్స్ అక్కడి ఫిలిం ఛాంబర్ నుంచి వ్యతిరేకతను ఎదురుకోవడం ఊహించని పరిణామం. ఆన్ లైన్ వేదికగా శాండల్ వుడ్ ఫ్యాన్స్ ఇలా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే వారం వెల్లడి కాబోతున్న తీర్పు కనక అనుకూలంగా రాకపోతే కాంతార నిర్మాతలు ఏం చేస్తారనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. నిర్మాత కం హీరో రిషబ్ శెట్టికి ఇదంతా పట్టించుకునే టైం లేదు. చివరి దశ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయకపోయినా తన సినిమా ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ తీసుకొస్తుందనే నమ్మకం తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నాడట. తల మీద విపరీతమైన హైప్ ఉన్న ఓజిని పెట్టుకుని కాంతార ఇంత నిమ్మళంగా ఉండటం అంతుచిక్కని విషయం. మొదటి భాగానికి ప్రచారం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడీ సీక్వెల్ కి హడావిడి చేయడం చాలా అవసరం. ట్రైలర్ ని సోమవారం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది ఎలా ఉందనే దాని మీద హైప్ ఆధారపడి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల హక్కులకు వంద కోట్ల దాకా డిమాండ్ చేశారనే టాక్ వచ్చింది. ఇప్పుడది డెబ్భై కోట్ల దగ్గర క్లోజ్ అవ్వొచ్చని ఇన్ సైడ్ టాక్. మైత్రి హక్కులు తీసుకున్నా ఎంత మొత్తమనేది అఫీషియల్ గా బయటికి రాలేదు. కాంతారకు పోటీ ఒక్క ఓజి రూపంలోనే లేదు. తమిళంలో ధనుష్ ఇడ్లీ కడాయిని తక్కువంచనా వేయడానికి లేదు. మంచి ఎమోషనల్ డ్రామాతో ధనుష్ ఈసారి సర్ప్రైజ్ చేస్తాడని చెన్నై మీడియా టాక్. అదే నిజమైతే ఇటు ఓజి, అటు ఇడ్లి కొట్టు మధ్య కాంతార చేయాల్సిన యుద్ధం కాస్త పెద్దదిగానే ఉంటుంది. ఎంత కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నా మరీ ఇంత నెమ్మదిగా ఉంటే రిస్క్ అయ్యేలా ఉంది.
This post was last modified on September 19, 2025 1:52 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…