భారీ అంచనాల మధ్య రిలీజై.. ఆ అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర ఇరగాడేస్తోంది ‘మిరాయ్’ సినిమా. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ పాన్ ఇండియ ా స్థాయిలో మరో పెద్ద హిట్ కొట్టినట్లే కనిపిస్తున్నాడు. ఈ చిత్రం తొలి వీకెండ్లోనే రూ.82 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది. హిందీలో కూడా వసూళ్లు స్టడీగా ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ పది కోట్ల మార్కును దాటేసింది. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ కావడానికి రాముడి పాత్ర కూడా ఓ కారణం.
ఉత్తరాది జనాలు రాముడి పాత్రను తెరపై ఎఫెక్టివ్‌గా చూపిస్తే ఉద్వేగానికి గురవుతారు. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్‌ను చూపించింది కాసేపే అయినా.. ఆ సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చాయి. ఐతే సినిమాలో రాముడి పాత్రను ఎవరు పోషించారనే విషయంలో మాత్రం ఆడియన్స్‌కు క్లారిటీ రాలేదు. మనకు తెలిసిన నటుడెవరైనా ఆ పాత్ర చేశారా అని ఆసక్తిగా చూస్తే.. పరిచయం లేని రూపం కనిపించింది. ‘కల్కి’లో శ్రీకృష్ణుడి పాత్ర తరహాలోనే లుక్ క్లియర్‌గా కనిపించలేదు. కొందరు ఇది ఏఐ క్రియేషన్ అనే సందేహాలు కూడా వ్యక్తం చేశారు.
కానీ అది నిజం కాదు. నార్త్ ఇండియాకు చెందిన ఒక థియేటర్ ఆర్టిస్ట్ కమ్ మోడల్ ఈ పాత్రను పోషించాడు. తన పేరు.. గౌరవ్ బోరా. అతను అనే థియేటర్ ప్లేస్, యాడ్ ఫిల్మ్స్‌లో నటించాడు. ‘మిరాయ్’ కోసం ఆడిషన్ ఇచ్చి మరీ అతను రాముడి పాత్రకు సెలక్ట్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో తనకీ అవకాశం దక్కడం పట్ల అతను అమితానందం వ్యక్తం చేశాడు. సినిమాలో తన ముఖం సరిగా కనిపించకపోయినా సరే.. రాముడి పాత్రలో కనిపించడమే ఒక వరం అంటూ అతను ఉద్వేగానికి గురయ్యాడు. ఈ సినిమా తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయని గౌరవ్ బోరా ఆశాభావం వ్యక్తం చేశాడు.
This post was last modified on September 15, 2025 10:17 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…