కొంచెం ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటాడన్న మాటే కానీ.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రాఘవ లారెన్స్‌కు ఉన్నంత సేవా భావం ఇంకెవరికీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. దేశంలో వందలు, వేల కోట్లతో సేవా కార్యక్రమాలు చేసే వాళ్లు ఉన్నారు కానీ.. అది వాళ్ల ఆదాయంలో చిన్న వాటా మాత్రమే. కానీ లారెన్స్ మాత్రం ఆదాయంలో సగానికి సగం.. కొన్నిసార్లు అంతకుమించి ఛారిటీ కోసం పెడతాడు అంటే ఆశ్చర్యం కలగక మానదు. డ్యాన్స్ మాస్టర్‌గా ఉన్నపుడే అతను పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా ఎదిగాక వాటి రేంజ్ ఇంకా పెంచాడు.
వందల మంది అనాథ పిల్లలకు తిండిపెట్టి, చదివించి ప్రయోజకులను చేశాడు. ఇప్పుడు లారెన్స్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. తన ఆదాయంతో తల్లి కొన్న తొలి ఇంటిని అతను తాను పోషిస్తున్న అనాథ పిల్లల కోసం స్కూల్‌గా మార్చేశాడు. డ్యాన్స్ మాస్టర్‌గా పని చేస్తున్నపుడు లారెన్స్ కూడబెట్టిన డబ్బులతో అతడి తల్లి చెన్నైలో ఒక ఇంటిని కొంది. అది లారెన్స్‌కు ఎంతో స్పెషల్. దాన్ని తర్వాతి కాలంలో పిల్లల కోసం అనాథాశ్రమంగా మార్చాడు.
అతను తన కుటుంబంతో కలిసి అద్దె ఇంటికి మారిపోయాడు. ఇప్పుడు ఆ అనాథశ్రమాన్ని పాఠశాలగా మార్చాలని లారెన్స్ నిర్ణయించుకున్నాడు. ఇన్నాళ్లూ ఆ ఇంట్లో ఉన్న పిల్లల్లో చాలామంది ప్రయోజకులు కావడంతో దాన్ని స్కూల్‌గా మార్చాలని లారెన్స్ డిసైడయ్యాడు. ‘కాంఛన-4’ కోసం తాను తీసుకున్న అడ్వాన్సుని ఈ ఇంటిని స్కూల్‌గా మార్చడం కోసం ఖర్చు చేస్తున్నట్లు లారెన్స్ వెల్లడించాడు. విశేషం ఏంటంటే.. లారెన్స్ చదివించిన ఓ అమ్మాయి ఈ స్కూల్లో ఉపాధ్యాయురాలు కాబోతోంది. లారెన్స్ ఈ ఇచ్చిన అప్‌డేట్ చూసి అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సోషల్ మీడియా జనాలు.
This post was last modified on September 13, 2025 2:11 pm
కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…
మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…
ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…
స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…
ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…