Movie News

మార్కోని మించిన హింసతో ఏం సాధిస్తారు

రేపు బాలీవుడ్ మూవీ బాఘీ 4 విడుదలవుతోంది. టైగర్ శ్రోఫ్ హీరోగా నటించిన ఈ సినిమాకు శాండల్ వుడ్ దర్శకుడు హర్ష డైరెక్షన్ చేశాడు. గతంలో గోపీచంద్ భీమా తీసింది ఇతనే. వర్షం రీమేక్ గా మొదలైన బాఘీ ఫ్రాంచైజ్ తర్వాత మాస్ పేరుతో క్రమంగా దారి తప్పుతూ ఓవర్ కమర్షియల్ డ్రామాగా మారిపోయింది. ఇప్పుడు నాలుగో భాగం రెడీ చేశారు. టీజర్ తో జనాలను భయపెట్టిన టీమ్ ట్రైలర్ తో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. సెన్సార్ దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమి లేదు కానీ నార్త్ వర్గాల్లో దీనికిచ్చిన కట్స్ గురించి చెబుతున్న కథనాలు ఓ రేంజ్ లో షాక్ కొట్టిస్తున్నాయి.

మొత్తం 23 విజువల్స్ కి సంబంధించి సెన్సార్ బోర్డు కట్స్ చెప్పిందట. శవపేటిక మీద నిలబడిన హీరో సీన్, తెగిపడిన చేయితో సిగరెట్ వెలిగించుకోవడం, పాక్షిక నగ్నంగా ఉంటూ అభ్యంతరం అనిపించే మరో సన్నివేశం, ఒక అమ్మాయిని అసభ్యం అనిపించేలా తాకే సీన్, కత్తులతో రౌడీలను పరమ కిరాతకంగా నరికేసే పదకొండు సెకండ్ల షాట్ ఇలా బోలెడు అభ్యంతరాలతో టీమ్ కు చాలా మార్పులు సూచించారట. ఇక్కడ రాయలేనివి కొన్ని ఉన్నాయి ఇక ఆడియో మ్యూట్స్ బోలెడు ఉన్నాయట. సుమారు 6 నిమిషాల 37 సెకండ్లు కత్తిరించుకుని వచ్చాక సెన్సార్ తో ఏ సర్టిఫికెట్ తీసుకున్నట్టు సమాచారం.

బహుశా దర్శకుడు హర్ష మార్కోని స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఉన్నాడు. అందులో హద్దుమీరిన హింస జనాన్ని థియేటర్లకు తీసుకొచ్చింది. కానీ జుగుప్స అనిపించే వయొలెన్స్ ని చాలా మంది ఏవగించుకున్నారు. హిందీ, తెలుగు లాంటి భాషల్లో ఆడియన్స్ ఆదరించలేదు. మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సో ఉన్ని ముకుందన్ మీద అంత హింస పండినప్పుడు టైగర్ శ్రోఫ్ కి దానికి పదింతలు ఉండాలని డిసైడ్ అయ్యారు కాబోలు. అయినా రాను రాను హద్దులు దాటుతున్న ఈ ట్రెండ్ ని సెన్సార్ అడ్డుకట్ట వేయడం పక్కన పెడితే ఫిలిం మేకర్స్ కూడా తమ కంటెంట్ ప్రభావం గురించి కొంత సీరియస్ గా ఆలోచించాలి.

This post was last modified on September 4, 2025 12:45 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

1 hour ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

2 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

3 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

4 hours ago