వచ్చే నెల అక్టోబర్ 2 విడుదల కాబోతున్న కాంతార చాప్టర్ 1 అప్పుడే అంచనాల పరంగా ఎంత ఎత్తులో ఉందో బిజినెస్ రూపంలో చూపిస్తోంది. హోంబాలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ విజువల్ గ్రాండియర్ ని హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి చాలా రిస్కులు చేసి తీశాడు. మధ్యలో ఎన్నో ఆటంకాలు, ప్రమాదాలు జరిగాయి. అయిన నెరవకుండా పూర్తి చేశాడు. కాంతార మొదటి భాగం కేవలం పదహారు కోట్లలో తీస్తే ఇప్పుడీ ప్రీక్వెల్ ఏకంగా రెండు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టించిందని బెంగళూరు టాక్. నిజమెంతో తెలిసేది థియేటర్ లో కంటెంట్ చూశాకే అయినా మేకింగ్ వీడియోలను బట్టి ప్రొడక్షన్ ఎంత గ్రాండ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఏపీ తెలంగాణకు సంబంధించిన హక్కుల నుంచి కాంతార చాప్టర్ 1 వంద కోట్లకు పైగానే బిజినెస్ ఆశిస్తోందట. రికవరబుల్ అడ్వాన్స్ పద్ధతి మీద అమ్మకాలు జరుగుతాయని ట్రేడ్ టాక్. ఒక్క నైజామ్ నుంచే 40 కోట్లు అంటే మాములు విషయం కాదు. టయర్ 1 స్టార్ హీరోలకు మాత్రమే ఈ రేట్ పలుకుతుంది. ఆంధ్రా 45 కోట్లు, సీడెడ్ 15 కోట్లు కోట్ చేసినట్టుగా సమాచారం. కొంచెం అటూఇటూ ఈ నెంబర్లకే డీల్స్ క్లోజ్ అవ్వొచ్చని టాక్. బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు రావాలంటే తెలుగు రాష్ట్రాల నుంచే ఎంతలేదన్నా నూటా డెబ్భై కోట్లకు పైగా గ్రాస్ రావాల్సి ఉంటుంది. ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తేనే అది సాధ్యం.
కానీ నిజంగా అంత డిమాండ్ ఉందా అనేది ఇంకొద్ది రోజులు వేచి చూస్తే క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఓజి వచ్చిన సరిగ్గా వారం రోజులకే కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కానుండటం ఆసక్తికర పరిణామం. ఇంత తక్కువ గ్యాప్ లో రెండు క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ తలపడటం అరుదుగా జరుగుతుంది. ఒకపక్క ఓజి మీద బయ్యర్లు భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనీసం నెలరోజులు ఓజాస్ గంభీర ఊచకోత ఉంటుంది. దాన్ని తట్టుకుని కాంతార చాప్టర్ 1 నిలవాలి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ డివోషనల్ థ్రిల్లర్ లో ఫస్ట్ పార్ట్ కు ముందు ఏం జరిగిందనేది చూపించబోతున్నారు.
This post was last modified on September 1, 2025 12:14 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…