హీరో-నిర్మాత దాగుడుమూతలు

హీరోలు కథలు వినడం ఓకె చేయడం వరకు బాగానే వుంటుంది. కానీ వన్స్ రెమ్యూనిరేషన్ దగ్గరకు వచ్చేసరికి హైడ్ అండ్ సీక్ వ్యవహారం మొదలవుతుంది. స్ట్రయిట్ గా హీరో చెప్పరు. స్ట్రయిట్ గా నిర్మత బేరాలు ఆడరు. మధ్యలో మేనేజర్లు కొంత వరకు వుంటారు. వీళ్లందరు కలిసి ఎవరి స్ట్రాటజీలు వారు వేస్తారు. అందులోనూ కాస్త సక్సెస్ రేట్ తక్కువ వున్న హీరో అయితే మరీనూ.

హీరో రవితేజ నిర్మాణ సంస్థ యువి ఇప్పుడు ఇలాగే చేస్తున్నాయని తెలుస్తోంది. డైరక్టర్ మారుతి చెప్పిన సబ్జెక్ట్ ను రవితేజ ఓకె చేసారు. వచ్చే ఏడాది ఆరంభంలో డేట్ లు ఇస్తా అన్నారు. అంతవరకు బాగానే వుంది. కానీ రెమ్యూనిరేషన్ మాట్లాడాల్సింది నిర్మాతలు. ఈ సినిమాకు నిర్మాతలు బన్నీవాస్-యువి వంశీ. ఇప్పుడు యువి వంశీ ఫైనల్ చేయాలి.

ఇక్కడే హైడ్ అండ్ సీక్ గేమ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా విడుదల వరకు ఆగుదాం. సినిమా హిట్ అయితే మరి కాస్త డిమాండ్ చేయచ్చు అని హీరో వైపు నుంచి ఆలోచనగా వుంది. అదే ఆలోచన రివర్స్ లో వుంది యువి వైపు నుంచి. క్రాక్ సినిమా రిజల్ట్ బాగుంటే ఒకె. లేదూ అంటే కాస్త బేరం ఆడొచ్చు అన్నది యువి ఆలోచన.

కానీ మద్యలో సమస్య డైరక్టర్ మారుతిది. ఆయనకు మరో ఆప్షన్ లేదు. రవితేజ డేట్ లు కావాల్సింది. కానీ అలా అని నిర్మాతను గట్టిగా ఫోర్స్ చేయలేరు. అందుకే ఆయన కూడా సైలంట్. ఇలా ముగ్గురి మధ్య దాగుడుమూతలు జనవరి వరకు సాగాల్సిందే. క్రాక్ విడుదలయ్యేది అప్పుడే కదా?

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)