సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్న వెంకటేష్ త్వరలో దర్శకుడు వివి వినాయక్ కాంబోలో ఒక సినిమా చేయొచ్చనే ప్రచారం నిన్న సోషల్ మీడియాలో తిరిగింది. ఎప్పుడో వీళిద్దరి కలయికలో వచ్చిన లక్ష్మి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇది జరిగి పంతొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి. ఏడేళ్లుగా వినాయక్ తెలుగు సినిమా డైరెక్ట్ చేయలేదు. ఛత్రపతి హిందీ రీమేక్ చేసి డిజాస్టర్ అందుకున్నాడు. ఖైదీ నెంబర్ 150 విజయం సాధించినా ఇంటెలిజెంట్ దెబ్బకు మళ్ళీ స్టార్లు ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. మధ్యలో దిల్ రాజు నిర్మాతగా శీనయ్య అని హీరోగా ట్రై చేశారు అది మొదలెట్టకుండానే ఆగిపోయింది.
ఇప్పుడు వెంకటేష్ చాలా క్యాలికులేటెడ్ గా ఉన్నారు. ఎలాంటి రిస్క్ తీసుకునే ఉద్దేశంలో లేరు. వినాయక్ కథలు రాస్తున్న మాట వాస్తవమే కానీ ఇప్పటికప్పుడు వెంకీ కాంబో అయితే సాధ్యం కాదనేది ఇన్ సైడ్ టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగా మెగా 157లో తన క్యామియోని వెంకటేష్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత దృశ్యం 3 ఉంది. బాలయ్యతో ఒక మల్టీస్టారర్ చేయబోతున్నానని ఆ మధ్య వెంకటేష్ చెప్పిన సంగతి తెలిసిందే. కాకపోతే కథా దర్శకుడు ఇంకా కుదరలేదు. చాలా టైం పడుతుంది. ఇంత టైట్ ప్యాకేజీలో వివి వినాయక్ కి స్కోప్ ఎక్కడుందనేది అర్థమైపోతుంది.
ఒకప్పుడు మాస్ సూపర్ హిట్స్ ఇచ్చిన వినాయక్ కంబ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుతున్నారు కానీ ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పరిశ్రమకు కొంత కాలం దూరంగా ఉన్నారు. ఇటీవలే ఇండస్ట్రీ ప్రముఖులను కలుసుకుంటూ వాటి ఫోటోలను సోషల్ మీడియాకి ఇస్తున్నారు. మరి నిజంగా వెంకటేష్ తో తిరిగి వస్తున్నారా లేక మరో హీరోతో ప్రయత్నాలు చేస్తున్నారా అనేది ఇంకొంత కాలం ఆగితే క్లారిటీ వస్తుంది. మాస్ జాతరతో దర్శకుడిగా పరిచయమవుతున్న భాను భోగవరపు స్నేహితుడు నందు చెప్పిన కథ కూడా వెంకటేష్ లిస్టులో ఉంది కానీ ఇంకా ఫైనల్ సిగ్నల్ రాలేదు. తుది నెరేషన్ తో మెప్పించాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates