Movie News

శ్రీకాంత్ ఓదెల – ఇంత ప్రేమ తట్టుకోవడం ఎలా

ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ హంగామాతో సోషల్ మీడియా ఊగిపోయింది. నిన్న సాయంత్రం విశ్వంభరతో మొదలైన హడావిడి ఇవాళ మన శంకరవరప్రసాద్ గారు టైటిల్ లాంచ్, చిరు బాబీ కాన్సెప్ట్ పోస్టర్ తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. అయితే ఇన్ని వీడియోలు, లుక్కులను మించిన ఎలివేషన్ శ్రీకాంత్ ఓదెల జస్ట్ ఒక ట్వీట్ తో ఇచ్చిపారేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. నా చిరంజీవిని మిస్సవుతూ వచ్చానని, నేను వెనక్కు తీసుకొస్తానని, ఇది రక్తంతో చేస్తున్న ప్రమాణమంటూ ఓ రేంజ్ లో గూస్ బంప్స్ పదాలతో ట్వీట్ నింపిన తీరు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉంది.

జీవిత కాలం ఆడే సినిమా చిరంజీవి, అలాంటిది చిరంజీవితోనే సినిమా అంటే జీవితాంతం గుర్తుండిపోయేలా తీయాలని, ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదని చెప్పడం శ్రీకాంత్ ఓదెల ఫ్యానిజంని పూర్తిగా బయట పెట్టేసింది. స్వయంగా అతని తల్లి ఫోటోలో నిన్నెప్పుడు నవ్వుతూ చూడలేదని, ఇప్పుడు చూశానని చిరంజీవితో కలిసి ఉన్న పిక్ ని ఉద్దేశించి చెప్పడం మరో ఎలివేషన్. నిన్న ఈరోజు చిరంజీవిని ఎందరో విష్ చేశారు కానీ ఈ స్థాయిలో ఊపేసింది మాత్రం శ్రీకాంత్ ఓదెల ఒక్కడే. దెబ్బకు ట్వీట్ వైరల్ అయిపోయి ఎక్కడ చూసినా దీని గురించిన చర్చలే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు తెరకెక్కడానికి ఇంకా టైం పడుతుంది. శ్రీకాంత్ ఓదెల ముందు నాని ది ప్యారడైజ్ పూర్తి చేయాలి. ఇది మార్చ్ లో రిలీజ్ అయ్యాక అప్పుడు మెగా 159 పనులు మొదలవుతాయి. ఈలోగా మన శంకరవరప్రసాద్ గారు, విశ్వంభర రిలీజైపోతాయి. బాబీతో చేస్తున్న సినిమా వేసవికంతా కొలిక్కి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఓదెలనే ఉంటాడు. నాని నిర్మాతగా వ్యవహరించబోతున్న మెగా 159లో హీరోయిన్ ని ఇంకా ఖరారు చేయలేదు. టెక్నికల్ టీమ్ ఫైనల్ కాలేదు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తోంది కానీ ఫైనల్ అయితే చేయలేదు. దీని అప్డేట్స్ ఇంకో ఆరేడు నెలల వరకు ఆశించలేం.

This post was last modified on August 22, 2025 8:16 pm

Share

Recent Posts

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

23 minutes ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

36 minutes ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

1 hour ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

1 hour ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

2 hours ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

2 hours ago