ముఫై కోట్లు అడ్వాన్స్ తీసుకున్నీ హీరో?

టాలీవుడ్ లోని టాప్ హీరోల్లో ఒకరు ముఫై కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ టాప్ హీరో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. మరో మూడు సినిమాలు కమిట్ అయ్యారు. చేస్తున్న సినిమా నిర్మాత నుంచి కమిట్ అయిన మరో ఇద్దరు నిర్మాతల నుంచి పది కోట్ల వంతున అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా తీసుకోవడం వెనుక వ్యవహారం వేరే వుందని తెలుస్తోంది. సిటీ మధ్యలో అమ్మకానికి వచ్చిన ఓ స్థలాన్ని కొనుగోలు చేయడం కోసం ఈ అడ్వాన్స్ లు వాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్థలాన్ని ఆయన తన సంతానం పేరిట కొనుగోలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

కరోనా టైమ్ లో అడ్వాన్స్ లు ఇంత భారీగా ఇవ్వడం, తీసుకోవడం చూస్తుంటే టాలీవుడ్ కు మళ్లీ పూర్వ వైభవం వచ్చేసినట్లే అనుకోవాలేమో?