Movie News

బన్నీ అట్లీ ప్రపంచంలో శివగామి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ బడ్జెట్ పరంగానే కాకుండా క్యాస్టింగ్ విషయంలోనూ అంతకంత అంచనాలు పెంచుకుంటూ పోతోంది. దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న ఇప్పటికే హీరోయిన్లుగా తోడవ్వగా భాగ్యశ్రీ బోర్సే కూడా చేరుతుందని టాక్ ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడీ ఏఏ 22 ప్రపంచంలోకి శివగామి అలియాస్ రమ్యకృష్ణ ప్రవేశించబోతున్నట్టు తాజా సమాచారం. ఒక ముఖ్యమైన పాత్ర అది కూడా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసేది కావడంతో అట్లీ పట్టుబట్టి మరీ ఆవిడను ఒప్పించారట. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా అల్లు అర్జున్ ఏ సినిమాలోనూ రమ్యకృష్ణ నటించలేదు. మొదటిసారి ఈ కాంబో అట్లీ వల్ల సాధ్యమవుతోంది. బాహుబలి తర్వాత ఆఫర్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న రమ్యకృష్ణకు ఇప్పుడు ఆఫర్ చేసిన పాత్ర చాలా డెప్త్ తో ఒక్క సిట్టింగ్ లోనే నచ్చేసిందట. బన్నీ తల్లిగా చేయొచ్చనే లీక్ ఉంది కానీ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇప్పటికే ముంబైలో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన అట్లీ షూటింగ్ అప్డేట్స్ ఎక్కువ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. హీరోయిన్లలో కూడా కేవలం రెండు పేర్లు మాత్రం అఫీషియల్ గా బయటికొచ్చాయి కానీ మిగిలినవి లీక్సే.

2026 విడుదలని టార్గెట్ గా పెట్టుకున్న ఏఏ 22కి రిలీజ్ డేట్ ఇంకా ఖరారు చేయలేదు. కనీసం ముప్పాతిక షూట్ పూర్తయ్యేకే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని అట్లీ, నిర్మాత కళానిధి మారన్ ఫిక్స్ అయ్యారట. పుష్ప 2 ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చేయబోతున్న సినిమా కాబట్టి బన్నీ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాలుగు షేడ్స్ ఉన్న విభిన్న పాత్రలను ఇందులో చేస్తున్నాడనే టాక్ ఉంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ స్పైరో రజాటోస్ లాంటి హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ బడ్జెట్ నాలుగు వందల కోట్ల పైమాటేనని చెన్నై టాక్. అంతకన్నా ఎక్కువే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదట.

This post was last modified on August 16, 2025 5:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

1 hour ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

2 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

2 hours ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

2 hours ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

3 hours ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

4 hours ago