అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. హారిక హాసిని బ్యానర్ మీద రూపొందబోయే ఎంటర్ టైనర్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా మెగా 157 తర్వాత వెంకటేష్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కానుంది. మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కు పేరు రావడానికి దోహదం చేసినవి వెంకీ మూవీసే. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వాసు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. వీటిలో మొదటి రెండింటికి దర్శకుడు విజయ్ భాస్కర్ అయినా యంగ్ ఆడియన్స్ చాలా మంది వాటిని డైరెక్ట్ చేసింది త్రివిక్రమే అని పొరపడుతుంటారు.
అంతగా పెనవేసుకుపోయిన ఈ కలయికలో మల్లీశ్వరిని మించిన మేజిక్ జరగాలని సినీ ప్రియులు కోరుతున్నారు. నిజానికిది ఏడెనిమిదేళ్ల క్రితం తెరకెక్కాల్సిన ప్రాజెక్టు. అప్పట్లో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈలోగా ఇద్దరూ ఎవరి కమిట్ మెంట్లో వాళ్ళు బిజీ కావడంతో ఎంత అనుకున్నా కుదరలేదు త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయాల్సిన ఫాంటసీ మూవీ క్యాన్సిలయ్యాక దాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో లాక్ చేసుకున్నారు. అయితే అది సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుండటంతో ఈలోగా వెంకటేష్ మూవీని వచ్చే వేసవికంతా రిలీజ్ చేసే టార్గెట్ తో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది 2025లో వెంకటేష్ రెండు సినిమాలు రిలీజయ్యే అవకాశముంది. చిరంజీవితో చేస్తున్న మెగా 157తో పాటు ఇప్పుడీ త్రివిక్రమ్ మూవీ కూడా ద్వితీయార్థంలోపే వస్తుంది. ఇవి కాకుండా వెంకీ మామ ఇంకా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇద్దరు కొత్త దర్శకులు కథలు చెప్పే పనిలో ఉన్నారు కానీ ఇంకా ఫైనల్ నెరేషన్ అవ్వలేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటిస్తున్న వెంకటేష్ ఇప్పటికే ఆరు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్నారు. వంద శాతం నచ్చితే తప్ప ఎవరికీ ఎస్ చెప్పడం లేదు. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాకు వెంకటరమణ, ఆనందరావు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.
This post was last modified on August 15, 2025 7:15 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…