సైలెంటుగా పెళ్లి చేసేసుకున్న ప్రభుదేవా?

ప్రభుదేవా వ్యక్తిగత వ్యవహారం మరోసారి వార్తాంశంగా మారింది. అతను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొన్ని రోజుల కిందట వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తన మేనకోడలినే అతను పెళ్లాడబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఐతే తమిళ మీడియా తాజా సమాచారం ప్రకారం ప్రభుదేవా పెళ్లయిపోయిందట. అతను ముంబయిలో చాలా తక్కువమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నాడట. కానీ వధువు అందరూ అనుకుంటున్నట్లు అతడి మేనకోడలు కాదని సమాచారం.

ఓ ఫిజియో థెరపిస్టును అతను పెళ్లాడినట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల కిందట ప్రభుదేవా తీవ్రమైన వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీనికి ట్రీట్మెంట్ తీసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లినపుడు ఆ డాక్టర్‌తో పరిచయం జరిగిందని.. తర్ావత అది ప్రేమగా మారిందని.. ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారని.. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లి చేసుకున్నారని అంటున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట చెన్నైకి చేరుకోగా.. అప్పుడు అక్కడి మీడియాకు విషయం తెలిసినట్లు చెబుతున్నారు.

ప్రభుదేవా యుక్త వయసులో రమ లత్‌ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఐతే పదేళ్ల కిందట ప్రభుదేవా అగ్ర కథానాయిక నయనతారతో ప్రేమలో పడ్డాడు. వీళ్లిద్దరూ కొంత కాలం సహజీవనం చేశాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుదేవా రమకు విడాకులు ఇచ్చాడు. నయన్ కూడా సినిమాలకు టాటా చెప్పేసి ప్రభుతో సెటిల్ కావడానికి సిద్ధమైంది. కానీ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అనగా వీరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అప్పట్నుంచి ప్రభుదేవా సింగిల్‌గా ఉంటున్నాడు. నయన్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టి పెద్ద రేంజికి వెళ్లింది. తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. త్వరలోనే వాళ్లిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.