సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదటిసారి కలయికలో తెరకెక్కిన కూలి ఆగస్ట్ 14 విడుదలకు రెడీ అవుతోంది. ఇవాళ చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ జరిగిపోయింది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి క్యాస్టింగ్ తో ఇప్పటికే దీని అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. దానికి తోడు అనిరుధ్ రవిచందర్ సంగీతం నుంచి ఛార్ట్ బస్టర్ పాటలు రావడంతో హైప్ అంతకంతా పెరగడమే జరిగింది. అందుకే అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. ఇప్పటిదాకా కథకు సంబంధించిన క్లూస్ ఇవ్వకుండా దాచి పెట్టిన లోకేష్ కనగరాజ్ మొదటిసారి స్టోరీ గుట్టు విప్పాడు.
అదో వేల మంది కార్మికులు పని చేసే పెద్ద పోర్టు. సముద్రం మీద జరిగే వ్యాపారం కావడం వల్ల అక్కడ తిరుగు లేని డాన్ గా ఎదుగుతాడు సైమన్ (నాగార్జున). బంగారం వాచీల స్మగ్లింగ్ తో ఎన్నో దందాలు రాజ్యమేలుతూ ఉంటాయి. అయితే దశాబ్దాలుగా కనిపించకుండా పోయిన దేవా (రజినీకాంత్) కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. వాళ్ళలో దేవా స్నేహితుడి (సత్యరాజ్) కూతురు (శృతి హాసన్) కూడా ఉంటుంది. అసలు వీళ్ళ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, దేవా ఎందుకు అందరిని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, తిరిగి మళ్ళీ వచ్చేందుకు ప్రేరేపించిన పరిస్థితులు ఏంటనేది తెరమీద చూడాలి.
మూడు నిమిషాల ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ లో లోకేష్ కనగరాజ్ ముద్ర స్పష్టంగా కనిపించింది. నాగార్జునని ఆవిష్కరించిన తీరు, ఇతర పాత్రలు, వాటి మధ్య కనెక్షన్లు ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఎప్పటిలాగే అనిరుధ్ రవిచందర్ సంగీతం ఎలివేషన్లకు ఉపయోగపడగా రజనీకాంత్ స్టైల్, స్వాగ్ అభిమానులను గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. లియో, మాస్టర్ తరహాలో బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ మల్టీస్టారర్ కోటింగ్ వల్ల కూలికి ఫ్రెష్ నెస్ వచ్చింది. కొండంత ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా వచ్చిన కూలీ ట్రైలర్ కు తగ్గట్టు అసలు సినిమా ఉంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతే.
This post was last modified on August 5, 2025 8:31 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…