ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో ప్రభాస్ కోసం ఎదురు చూస్తోన్న ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‍ను అయ్యో పాపం అంటూ మీడియా వాళ్లు జాలి పడిపోతున్నారు. కానీ ఆదిపురుష్‍కి ప్రభాస్ ముందుగా డేట్స్ ఇవ్వడం వల్ల నాగ్ అశ్విన్‍కు నష్టమేమీ లేదు. ఇంకా చెప్పాలంటే దీని వల్ల తన సినిమా త్వరగా ఫినిష్ చేయాలనే ఒత్తిడి అతడిపై తగ్గుతుంది.
ఆదిపురుష్ చిత్రానికి కేవలం అరవై రోజుల కాల్షీట్లు మాత్రమే అడిగారట. ఆ సినిమాకు ఆన్ లొకేషన్ కంటే గ్రాఫిక్స్ పరంగా జరిగేదే ఎక్కువ అట. అందుకే కచ్చితంగా అరవై రోజులు మాత్రమే ఇస్తే చాలని ఓం రౌత్ అడగడంతో ప్రభాస్ ఆ చిత్రానికి డేట్స్ ఇచ్చాడు. ఆ అరవై రోజుల షూట్ చేసేలోపే నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రభాస్ మొదలు పెడతాడు. అంటే నాగ్ అశ్విన్ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పట్టినా కానీ అతనిపై ఎలాంటి ఒత్తిడి వుండదు.
ఇంటర్నేషనల్ లెవల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలని ఆశిస్తోన్న అశ్విన్‍కు ఇది శుభ వార్తే. అందుకే అతడిని అయ్యో పాపం అనుకోనక్కర్లేదు. ఈ రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించడం వల్ల ప్రభాస్‍కి వచ్చే మూడేళ్లలోను మూడు రిలీజ్‍లు వుంటాయి కనుక అతనికీ త్వరగా సినిమాలు చేయడం లేదనే ఒత్తిడి వుండదు.
This post was last modified on November 19, 2020 5:04 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…