Movie News

కూలీ ట్రైలర్.. హైప్‌ను పెంచిందా? తగ్గించిందా?


ఇంకో పది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర మెగా క్లాష్ చూడబోతున్నాం. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య పాత్ర పోషించిన బాలీవుడ్ మూవీ ‘వార్-2’, సూపర్ స్టార్ రజినీకంత్ మూవీ ‘కూలీ’ ఒకే రోజు.. అంటే ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఇప్పటిదాకా హైప్ పరంగా ‘కూలీ’నే కొంచెం ముందంజలో ఉందన్నది వాస్తవం. రజినీకి తోడు అక్కినేని నాగార్జు, ఉపేంద్ర లాంటి పెద్ద హీరోలుండడం.. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకుడు కావడం ఈ హైప్‌కు కారణం. ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచాయి.

చాలా ముందే వచ్చేసిన ‘వార్-2’ ట్రైలర్ నాట్ బ్యాడ్ అనిపించింది తప్ప.. ఆహా ఓహో అనుకునే స్థాయిలో మాత్రం లేదు. మరి ‘కూలీ’ ట్రైలర్ ఎలా ఉంటుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ ట్రైలర్ రానే వచ్చింది. మరి ట్రైలర్‌కు రెస్పాన్స్ ఎలా ఉంది.. ఇది సినిమాకున్న హైప్‌ను పెంచిందా, తగ్గించిందా అన్నది ఆసక్తికరం. ‘కూలీ’ ట్రైలర్ విషయంలో కొంచెం మిక్స్‌డ్ టాకే కనిపిస్తోంది. కొందరు సూపర్ అంటున్నారు. కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యునానిమస్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అయితే కనిపించడం లేదు.

లోకేష్ మార్కు స్టైలిష్ టేకింగ్, ఎలివేషన్లు ట్రైలర్‌లో హైలైట్ అయినా.. రజినీ, నాగ్, ఆమిర్ ఖాన్ చాలా అట్రాక్టివ్‌గానే కనిపించినా.. కేవలం క్యారెక్టర్ల పరిచయానికే ట్రైలర్‌ను వాడుకున్నారని.. కథ గురించి ఏమీ చెప్పకపోవడం.. ఆసక్తి రేకెత్తించే డైలాగులు లేకపోవడం పట్ల నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది. ఐతే లోకేష్ అంతా సినిమాలోనే చూపించేలా ఉన్నాడని.. అక్కడ చాలా సర్ప్రైజులు ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది.

కథ పరంగా లోకేష్ ఈసారి ఏదో ప్రయోగం చేసినట్లున్నాడని.. ఇదేదో టైమ్ ట్రావెల్ స్టోరీలా ఉందే అని ట్రైలర్లో కొన్ని విజువల్స్ చూసి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రజినీ లాంటి మాస్ హీరోతో.. ఇలాంటి ప్రయోగాలు వర్కవుట్ అవుతాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్లో కథ విప్పకపోవడం ద్వారా క్యూరియాసిటీ పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నా.. ప్రేక్షకులు ఇప్పటిదాకా పెట్టుకున్న అంచనాలకు కొంచెం భిన్నంగా సాగేలా కనిపిస్తున్న సినిమా వారిని నిరాశకు గురి చేస్తుందా అనే డౌట్లు కూడా కొడుతున్నాయి. ట్రైలర్ తర్వాత సినిమాకు హైప్ తగ్గిందా అంటే చెప్పలేం కానీ.. ఉన్న హైప్‌ను పెంచేలా మాత్రం ట్రైలర్ లేదన్నది వాస్తవం.

This post was last modified on August 3, 2025 10:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago