గత ఏడాది టీజర్ రిలీజై నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చాక విశ్వంభర దర్శకుడు వశిష్ఠ మీడియాకు దొరకలేదు. షూటింగ్ లో బిజీగా ఉండటం, అపుడప్పుడు ప్రైవేట్ ఈవెంట్స్ లో కనిపించడం తప్ప తానుగా ఏదైనా చెప్పే చొరవ తీసుకోలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా తాలూకు ప్రతీకూల ప్రచారాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఇంకా విడుదల తేదీ ఖరారు కాకుండా సడన్ గా ఎంట్రీ ఇవ్వడం మెగా ఫాన్స్ సైతం ఊహించలేదు. అందులోనూ స్టోరీ లైన్ చెప్పేయడం, సినిమా ప్రోగ్రెస్ ని స్పష్టంగా వివరించడం లాంటివి చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హరిహర వీరమల్లు రిలీజ్ ముంగిట్లో వశిష్ఠ ఇలా చేయడం వెనుక కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొన్ని విషయాలు తెలిశాయి. ఎప్పుడో సంక్రాంతికి వచ్చే మెగా 157 మీద అటెన్షన్ ఎక్కువవుతోందని, కానీ దాని కన్నా ముందు రిలీజయ్యే విశ్వంభర మీద ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లడం మంచి సంకేతం కాదని భావించిన చిరంజీవి స్వయంగా వీటికి చెక్ పెట్టే బాధ్యతను వశిష్ఠకు అప్పజెప్పారట. ఇటీవలే మెగాస్టార్ ని కలిసిన కొందరు ఫ్యాన్స్ నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దానికి అనుగుణంగానే వసిష్ఠ విఎఫ్ఎక్స్, స్టోరీ పాయింట్ గురించి ఓపెన్ గా మాట్లాడేస్తున్నాడు.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విశ్వంభర రిలీజ్ ఉంటుందనే హింట్ ని వశిష్ఠ ఇవ్వడం చూస్తే పనులు చకచకా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కల్కి 2898 ఏడి, సూపర్ మ్యాన్ 2025కి పని చేసిన విదేశీ నిపుణులే ఇప్పుడీ విశ్వంభరకి వర్క్ చేయడం గురించి వశిష్ట గొప్పగా చెప్పుకున్నాడు. కేవలం ఒక సినిమా అనుభవమే ఉన్న తనను నమ్మి ఇంత పెద్ద కాన్వాస్ కు ఒప్పుకున్న చిరంజీవిని బెస్ట్ గా చూపిస్తానని హామీ ఇస్తున్నాడు. ప్రస్తుతానికి అక్టోబర్ 18 డేట్ ఒకటి పరిశీలనలో ఉందట. లేదా ఇంకో వారం లేట్ ఆప్షన్ కూడా పెట్టుకున్నారట. ఏదైతేనేం అప్డేట్స్ మొదలయ్యాయి. ఫ్యాన్స్ కోరుకునేది అదే.
This post was last modified on July 20, 2025 5:49 pm
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…