Movie News

నాగ్-అఖిల్.. మల్టీస్టారర్?

అక్కినేని నాగార్జునకు ఇప్పుడు కలవరమంతా తన చిన్న కొడుకు అఖిల్ గురించే. పెద్ద కొడుకు నాగచైతన్యకూ కెరీర్లో శుభారంభం దక్కకపోయినా తర్వాత ఎలాగోలా నిలదొక్కుకున్నాడు. నాగ్ కోరుకున్నట్లు పెద్ద స్టార్ అయిపోకున్నా.. నిలకడగా హిట్లు కొడుతూ మీడియం రేంజ్ హీరోగా స్థిరపడ్డాడు. కానీ అఖిల్ మాత్రం అరంగేట్రం చేసి ఐదేళ్లవుతున్నా తొలి విజయాన్ని రుచి చూడలేదు.

ఈ మధ్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘సక్సెస్ ఫుల్ 5 ఇయర్స్ ఫర్ అఖిల్’ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను అక్కినేని అభిమానులు ట్రెండ్ చేస్తుంటే అందరికీ కామెడీగా అనిపించింది. చేసిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాక అఖిల్ ఎలా సక్సెస్ ఫుల్ అయినట్లు భావించాలి. గతం సంగతలా వదిలేస్తే అఖిల్ నటిస్తున్న కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అయినా అతడికి తొలి విజయాన్నందిస్తుందో లేదో చూడాలి.

‘బ్యాచిలర్’ బాధ్యతంతా అల్లు కాంపౌండ్ మీద పెట్టేసిన నాగ్.. అఖిల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద దృష్టిపెట్టాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అఖిల్‌కు ఓ సినిమా సెట్ చేసి పెట్టిన నాగ్.. చిన్న కొడుకు కోసం మరో క్రేజీ ప్రాజెక్టును రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా ఐదు హిట్లు ఇచ్చి పెద్ద రేంజికి వెళ్లిన అనిల్ రావిపూడి.. నాగార్జున కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ముందు నాగ్‌తో మాత్రమే అనిల్ సినిమా అన్నారు కానీ.. ఇప్పుడేమో అఖిల్ కూడా ఇందులో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తండ్రీ కొడుకులు కలిసి నటించబోయే తొలి మల్టీస్లారర్ ఇదని అంటున్నారు.

మరి అనిల్ ముందే అఖిల్‌ను ఈ సినిమా కోసం అనుకున్నాడా.. లేక నాగ్ కొడుకుని ఇందులోకి తెచ్చాడా అన్నది తెలియదు. అనిల్‌తో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే భరోసా ఉంటుంది. కాబట్టి కొడుకు ఖాతాలో ఓ హిట్ పడుతుందని నాగ్ ఆశిస్తుండొచ్చు. మరి ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో.. నాగ్-అఖిల్ నిజంగానే ఇందులో నటించబోతున్నారో లేదో చూడాలి.

This post was last modified on November 17, 2020 4:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

5 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

30 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

32 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago