ఏడాదిన్నర కిందట సంక్రాంతికి ‘నా సామి రంగ’తో ప్రేక్షకులను పలకరించాడు అక్కినేని నాగార్జున. సోలో హీరోగా ఆయనకు అదే చివరి చిత్రం. ఇప్పటిదాకా కొత్త సినిమా ఏదీ మొదలుపెట్టలేదు. ఇటీవలే ఆయన కీలక పాత్ర పోషించిన ‘కుబేర’ రిలీజైంది. ఆ సినిమా మంచి ఫలితాన్నందుకుంది. అందులో నాగ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఆయన త్వరలోనే ‘కూలీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఐతే నాగ్ సోలో హీరోగా చేసే సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దాని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ.. ఎంతకీ ఆ సినిమా మొదలైతే కావడం లేదు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఏదైనా ఒరిజినల్ స్టోరీతోనే అతను నాగ్‌తో సినిమా తీస్తాడని అనుకున్నారు. కానీ అతను చేయబోయేది రీమేక్ అని వార్తలు వస్తున్నాయి.
తమిళంలో హిట్ అయిన ‘అయోత్తి’ అనే సినిమాను నాగ్ హీరోగా కార్తీక్ రీమేక్ చేయబోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ రీమేక్ నాగ్‌కు కరెక్టేనా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కార్తీక్ దర్శకత్వంలో నాగ్ చేయబోయేది ఆయనకు ల్యాండ్ మార్క్ ఫిలిం కావడం గమనార్హం. ఇది ఆయనకు 100వ సినిమా కాబోతోంది. అలాంటి మైల్ స్టోన్ మూవీ చాలా స్పెషల్‌గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. హీరోయిజం బాగా ఉన్న మాస్ మూవీ అయితే బాగుంటుందని అనుకుంటారు. కానీ ‘అయోత్తి’ ఆ టైపు సినిమా కాదు. ఇది స్టార్ ఇమేజ్ ఉన్న హీరో చేయదగ్గ కథే కాదు.
‘అయోత్తి’ కథ గురించి సింపుల్‌గా చెప్పుకుంటే.. నార్త్ ఇండియా నుంచి ఒక ఫ్యామిలీ తమిళనాడు పర్యటనకు వస్తుంది. కానీ వాళ్లు అద్దెకు తీసుకున్న కారుకు ప్రమాదం జరుగుతుంది. తల్లి చనిపోతే.. తండ్రి, కూతురు కలిసి తన మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి ఇబ్బంది పడతారు. కారు డ్రైవర్ వాళ్లకు ఎలా సాయపడి ఆ పని పూర్తి చేశాడన్నదే ఈ కథ. దీన్ని చాలా హృద్యంగా డీల్ చేశారు తమిళంలో.
ఐతే ఇలాంటి కథ నాగార్జునకు ఏమాత్రం సూటవుతుందన్నది ప్రశ్న. ఆయన స్థాయికి ఇది చిన్న కథగా అనిపించొచ్చు. నాగ్ ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తుంటాడన్నది తెలిసిందే. ‘కుబేర’లో కూడా అలాగే చేశాడు. కానీ ఆ కథలో ఆయన పాత్ర బాగా ఎలివేట్ అయింది. కానీ ‘అయోత్తి’ రీమేక్ మాత్రం నాగార్జున స్థాయికి సరిపోదన్నది అభిమానుల అభిప్రాయం. అసలే ఈ రోజుల్లో రీమేక్‌లు అస్సలు వర్కవుట్ కావడం లేదు. పైగా నాగ్‌కు సెట్ కాని కథతో రీమేక్ చేయడం మరింత రిస్క్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 11, 2025 2:43 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…