ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్.’తో బిజీగా వున్నాడు కాబట్టి, ఆ సినిమాకి సంబంధించి తన వర్క్ ఎప్పటికి పూర్తవుతుందనేది తెలియదు కాబట్టి… అంతవరకు వేచి వుండలేక త్రివిక్రమ్ ఈలోగా మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అగ్ర హీరోతో సినిమాకు ఎన్టీఆర్ అభ్యంతరం చెబుతున్నాడని ఒక మిడిల్ రేంజ్ సినిమా చేసే ఆలోచనలో వున్నాడని కూడా చెప్పుకున్నారు. అయితే త్రివిక్రమ్ ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టి తారక్ కోసమే ఎదురు చూస్తున్నాడు.
మార్చి నుంచి తాను ఖచ్చితంగా అందుబాటులో వుంటానని తారక్ మాట ఇవ్వడంతో త్రివిక్రమ్ మిగతా ప్లాన్స్ రద్దు చేసుకున్నాడు. అంతే కాకుండా ఆ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరం చేస్తున్నాడు. తద్వారా తారక్‍పై త్రివిక్రమ్ ఒత్తిడి పెంచుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ తప్పనిసరిగా మార్చి నుంచి ఈ చిత్రం షూటింగ్‍లో పాల్గొనాలి. కానీ అది ఎన్టీఆర్ చేతిలో లేదు. రాజమౌళి ఎప్పటికి తనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే దానిపై క్లారిటీ లేదు.
ఇదిలావుంటే తారక్ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు పవన్‍తో సితార ఎంటర్‍టైన్‍మెంట్స్ నిర్మిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రానికి త్రివిక్రమ్ మార్పులు చేసి, మాటలు అందిస్తారనే ప్రచారం జరుగుతోంది.
This post was last modified on November 16, 2020 4:19 pm
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…