నిర్మాత దిల్ రాజు చాలాసార్లు ఓపెన్ గా మాట్లాడేస్తారు. ఎదురుగా ఉన్నది తన బ్యానర్ లో నటించిన హీరో అయినా సరే మొహమాటాలు పెట్టుకోరు. అలా నిజాయితీగా నిజాలు చెప్పడం ఒకరకంగా మంచిదే. జులై 4 విడుదల కాబోతున్న తమ్ముడు ప్రమోషన్లలో భాగంగా నితిన్, దిల్ రాజు కలిసి పరస్పరం ఒక ఇంటర్వ్యూ చేసుకున్నారు. అందులో భాగంగా నితిన్ ప్లస్సులు మైనస్సుల గురించి రాజు గారు చెబుతూ ఆర్య చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ ని, దిల్ చేస్తున్నప్పుడు నితిన్ ని చాలా పెద్ద స్టార్లు అవుతారని ఊహించానని, కానీ బన్నీ అది సాధిస్తే నువ్వు అచీవ్ చేయలేకపోయావని మొహం మీద చెప్పేయడం ట్విస్టు.
ఇక్కడితో అయిపోలేదు. తమ్ముడుతో సక్సెస్ ఫుల్ హీరోగా నితిన్ మళ్ళీ ప్రూవ్ అయినా అది సరిపోదని, ఎల్లమ్మతో ఇది నెరవేరుతుందని దిల్ రాజు ముందే జోస్యం కూడా చెప్పేశారు. నితిన్ కూడా పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. వరస డిజాస్టర్లతో బాగా కుదేలైపోయిన తనకు తమ్ముడు హిట్టు కొట్టడం చాలా అవసరం. బజ్ మరీ విపరీతంగా లేదు కానీ ట్రైలర్ చూశాక వచ్చిన నమ్మకం, ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వదలబోయే కొత్త ట్రైలర్ మీదున్న అంచనాలు వెరసి కంటెంట్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో బయ్యర్లు ఆసక్తిగా ఉన్నారు.
కుబేర, కన్నప్పలు ఇచ్చిన బాక్సాఫీస్ కిక్కుని కొనసాగించాల్సిన బాధ్యత తమ్ముడు మీదయితే ఉంది. పోటీ పెద్దగా లేదు. సిద్దార్థ్ డబ్బింగ్ సినిమా 3 బిహెచ్కెతో పాటు హాలీవుడ్ మూవీ జురాసిక్ వరల్డ్ రీ బర్త్ మాత్రమే రేసులో ఉన్నాయి. సో తమ్ముడు కనక కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ముఖ్యంగా మాస్ సెంటర్స్ నుంచి మంచి వసూళ్లు ఆశించవచ్చు. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన తమ్ముడుతో సీనియర్ హీరోయిన్ లయ అక్క పాత్రలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. టీమ్ అంతా కలిసి పబ్లిసిటీ బాగా చేస్తున్నారు. దిల్ రాజు చాలా అరుదుగా ఇంత అగ్రెసివ్ ప్రమోషన్లలో పాల్గొంటారు. హిట్టు పడేలానే ఉంది మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates