ఫ్యామిలీ థ్రిల్లర్స్ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దృశ్యం మూడో భాగానికి రంగం సిద్ధమవుతోంది. ఇవాళ మోహన్ లాల్ అధికారికంగా పార్ట్ 3 ని లాంచ్ చేయగా హిందీలో అజయ్ దేవగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు రెడీ కాబోతున్నాయి. ఒకటే కథా కాదానేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ తెలుగులో వెంకటేష్ చేయడం గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్ ని అయోమయంలో నెడుతోంది. ప్రస్తుతం మెగా 157, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కమిట్ మెంట్స్ ఉన్న వెంకీ మామ వీటితో పాటు దృశ్యం 3 చేయాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు మాయమైన శవం చుట్టూ తిరిగే దృశ్యం కథ పార్ట్ 3తో ముగింపుకు రానుంది. డెడ్ బాడీని ఇంత కాలం దాచి పెట్టిన హీరో చివరికి దాన్ని తల్లి తండ్రులకు అప్పగించడంతో పాటు వేరొక క్రైమ్ లో ఇరుక్కుపోవడం లాంటి పాయింట్ తో దీన్ని మరింత ఇంటెన్స్ తో తీస్తారట. దర్శకుడు జీతూ జోసెఫ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్లే సిద్ధం చేశారని కేరళ మీడియా టాక్. అక్టోబర్ నుంచి మోహన్ లాల్ దృశ్యం 3 షూటింగ్ కు వెళ్లనున్నారు. అజయ్ దేవగన్ 2026 అక్టోబర్ 2 విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకుని పనులు ప్రారంభించబోతున్నాడు. కానీ వెంకీ మామ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే పెండింగ్ ఉంది.
రాంబాబుగా వెంకటేష్ తప్ప ఆ పాత్రని ఇంకెవరూ చేయలేరన్నంత గొప్పగా దృశ్యం మనకు రిజిస్టర్ అయ్యింది. దృశ్యం 2 ఓటిటిలో రావడం బాక్సాఫీస్ రన్ మిస్సయ్యిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు కానీ ఇప్పుడా టెన్షన్ అక్కర్లేదు. దృశ్యం 3 నిజంగా కార్యరూపం దాలిస్తే థియేటర్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు. ప్రస్తుతానికి వెంకటేష్ దగ్గర ప్రతిపాదన ఉంది కానీ చేస్తారా చేయరా అనే దాని మీద క్లారిటీ లేదంటున్నారు. కొద్దిరోజులు వేచి చూడాల్సి రావొచ్చు. సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ ఇటీవలే రానా నాయుడు 2 వెబ్ సిరీస్ లో కనిపించారు కాని పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates