అనంతిక సనిల్‌కుమార్.. ‘మ్యాడ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళ భామ. టీనేజీ అమ్మాయే అయినా ఆ సినిమాలో క్యూట్‌గా కనిపిస్తూ, చక్కగా నటిస్తూ ఆకట్టుకుంది. అందులో ఆమెను చూసి ఇంప్రెస్ అయ్యే యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ‘8 వసంతాలు’ సినిమాలో అవకాశమిచ్చాడు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. పైగా పెర్ఫామెన్స్‌కి బాగా స్కోప్ ఉన్నది. ఈ అవకాశాన్ని అనంతిక బాగానే సద్వినియోగం చేసుకున్నట్లే కనిపిస్తోంది ఈ సినిమా టీజర్లు, ట్రైలర్ చూస్తే.
ఇక మంగళవారం రాత్రి జరిగిన ‘8 వసంతాలు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అనంతిక టాలెంట్ చూసి అందరూ ఔరా అనుకున్నారు. ఈ అమ్మాయిలో ఇన్ని కళలున్నాయా అంటూ నోరెళ్లబెట్టి చూశారు. తన స్టేజ్ పెర్ఫామెన్స్ మామూలుగా సాగలేదు మరి. అవంతిక ట్రైన్డ్ క్లాసికల్ డ్యాన్సర్. ఈ ప్రతిభను సినిమాలోనే కాదు.. స్టేజ్ మీద కూడా చూపించింది అనంతిక. ‘సాగర సంగమం’లోని ఓ పాటకు ఆమె అద్భుతంగా అభినయించింది. ఇది ఒకెత్తయితే.. అనంతిక మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం మరో ఎత్తు. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఒక చైనీస్ మార్షల్ ఆర్ట్‌ను నేర్చుకుంది అనంతిక. ట్రైలర్లో చూపించిన ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో ఆ నైపుణ్యం కనిపించింది. స్టేజ్ మీద తన ప్రతిభ మరింత ఎలివేట్ అయింది.
సినిమా కోసం ట్రైనింగ్ అంటే ఏదో మొక్కుబడిగా చేసి ఉంటారని చాలామంది అనుకుంటారు కానీ.. అనంతిక చాలా సీరియస్‌గానే ఈ యుద్ధ కళను నేర్చుకుని, అందులో మంచి నైపుణ్యం సంపాదించిందని స్టేజ్ పెర్ఫామెన్స్ చూస్తే అర్థమైంది. ఇక అనంతిక ప్రసంగం కూడా సుదీర్ఘంగా సాగి ఆకట్టుకుంది. ఆమె చక్కటి తెలుగులో మాట్లాడ్డం విశేషం. టైం అయిపోతుందని యాంకర్ సుమ మైక్ తీసుకునే ప్రయత్నం చేసినా.. ఆమె ఇవ్వకుండా అలాగే మాట్లాడుతూ సాగడం విశేషం. చివరికి అతి కష్టం మీద సుమ ఆమె నుంచి మైక్ తీసుకుంది.
This post was last modified on June 18, 2025 10:21 am
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…