మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ డైలాగు ఒకటుంటుంది. బ్రహ్మానందంతో డిన్నర్ హాలుకు వెళ్తూ అక్కడికి చేరగానే ఏడు కొండలు ఎక్కినప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదని అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అచ్చం ఇదే మాట అనుకుంటున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ విడుదల తేదీ వచ్చేసింది కాబట్టి. ముందుగా లీకైనట్టే జూన్ 12 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. కత్తి పట్టిన పవన్ కళ్యాణ్ కొత్త స్టిల్ వదిలి ఫ్యాన్స్ లో ఉన్న అనుమానాలన్నీ అఫీషియల్ గా తీర్చేసింది.
ఇవాళ్టిని మినహాయిస్తే హరిహర వీరమల్లు రాకకు కేవలం 27 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ నిడివిలోనే ట్రైలర్ లాంచ్, బాలన్స్ పాటల విడుదల, ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు అన్నీ చేసుకోవాలి. ఏపీ డిప్యూటీ సిఎంగా పవన్ బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రతిచోటా ఆయన్ని ఆశించలేం కానీ వీలైనంత వరకు పబ్లిసిటీలో భాగమవుతానని నిర్మాత ఏఎం రత్నంకు మాట ఇచ్చినట్టు సన్నిహిత వర్గాల సమాచారం. జూన్ 5 వచ్చే కమల్ హాసన్ తగ్ లైఫ్ మినహాయించి హరిహర వీరమల్లు చెప్పుకోదగ్గ పోటీ లేదు కాబట్టి ఓపెనింగ్స్ పరంగా భారీ నెంబర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక ఇప్పటి నుంచి అభిమానులు, సినిమా టీమ్ పరుగులు పెట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ. మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజవుతున్న తొలి సినిమా కూడా ఇదే. అందుకే ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. విపరీతమైన జాప్యం వల్ల హైప్ కొంచెం హెచ్చుతగ్గులకు గురైనా జూన్ 12 నాటికి వాతావరణంలో మార్పు వచ్చేలా ఉంది. ముఖ్యంగా ట్రైలర్ గురించి టీమ్ ఓ రేంజ్ లో ఊరిస్తోంది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు ఎంఎం కీరవాణి అందించిన సంగీతం హైలైట్స్ లో ఒకటిగా చెబుతున్నారు. చూడాలి వీరమల్లు ఏం అద్భుతాలు చేస్తాడో
This post was last modified on May 16, 2025 1:41 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…