సైలెంటుగా వచ్చి సింగిల్ గా కలెక్షన్లు కొల్లగొడుతున్న శ్రీవిష్ణు మరో హిట్టుని ఖాతాలో వేసుకున్నాడు. పోటీలేని అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుని మొదటి వారం కాకుండానే పదిహేను కోట్ల గ్రాస్ దాటేసి ఇంకో సూపర్ వీకెండ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాంపిటీషన్ లో ఉన్న శుభం కన్నా చాలా మెరుగ్గా సింగిల్ వసూళ్లు ఉండగా ముందే ఊహించినట్టు జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ ప్రభావం మొదటి రెండు మూడు రోజులైతే కనిపించింది. వారాంతం కాగానే చిరు శ్రీదేవి సెలవు తీసుకోగా సింగిల్ ఇంకా బలంగా ఊపందుకుంది. టీమ్ ప్రమోషన్ల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా పరుగులు పెడుతోంది.
ఇదిలా ఉండగా సింగిల్ కు విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. సాధ్యపడలేదో లేక టైం తక్కువనుకున్నారో ఏమో కానీ ఫన్ బ్లాస్ట్ పేరుతో చిన్న వేడుక నిర్వహించి టీమ్ సభ్యులు పరిమిత ఆహ్వానితుల మధ్య సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇంతకు ముందు సామజవరగమనకు సైతం ప్రీ రిలీజ్ చేయలేదు. విచిత్రంగా ఈ రెండు సినిమాలు విజయం సాధించడం గమనార్హం. అయితే మధ్యలో స్వాగ్ కి వేడుక జరిగింది. బాక్సాఫీస్ ఫలితం తెలిసిందే. ప్రతిసారి ఇలాగే జరుగుతుందని కాదు కానీ కాకతాళీయంగా సామజవరగమన, సింగిల్ రెండింటికి ఇలా జరగడం, ఒకే రిజల్ట్ అందుకోవడం విచిత్రమే.
ఫైనల్ రన్ ఇంకా దూరంగా ఉంది కనక శ్రీవిష్ణు బిజినెస్ కోణంలో చూసుకుంటే పెద్ద ఫిగర్లనే నమోదు చేయబోతున్నాడు. వెన్నెల కిషోర్ తో పండించిన కామెడీ యూత్ ని బాగా ఆకర్షిస్తోంది. ఇద్దరు హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా కంటే శ్రీవిష్ణు, కిషోర్ కెమిస్ట్రీనే తెరమీద బ్రహ్మాండంగా పేలింది. రిలీజ్ విషయంలో అల్లు అరవింద్ ప్లానింగ్ ఎంత గొప్పగా వర్కౌట్ అవుతుందో చెప్పడానికి సింగిల్ మరో ఉదాహరణగా నిలుస్తోంది. తండేల్ ని సైతం ఇదే తరహాలో ఫిబ్రవరిలో సెట్ చేసిన గీత ఆర్ట్స్ ఇంతకు మించిన ఫలితాన్ని అందుకుంది. కంటెంట్ కన్నా ముఖ్యంగా రిలీజ్ టైమింగ్ ప్రాముఖ్యత చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ.
This post was last modified on May 13, 2025 8:43 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…