ఇటీవలే అజిత్ కి గుడ్ బ్యాడ్ అగ్లీ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఇటీవలే బాలకృష్ణకో కథ చెప్పారనే ప్రచారం చెన్నై వర్గాల్లో జోరుగా జరుగుతోంది. పాయింట్ నచ్చిందని, ఫుల్ నెరేషన్ విన్నాక నిర్ణయం తీసుకుందామని ఇద్దరూ అనుకున్నట్టుగా వాటి సారాంశం. నిజానికి అజిత్ తోనే ఆధిక్ మరో మూవీ ప్లాన్ చేసుకున్నాడు. కాకపోతే వెంటనే కార్యరూపం దాల్చడం గురించి అనుమానాలున్నాయి. తన వింటేజ్ హీరోయిజంని అభిమానులకు నచ్చేలా చూపించిన ఇతని మీద అజిత్ కు విపరీతమైన నమ్మకం వచ్చేసింది. సిరుతై శివలాగా వరసగా ఛాన్సులివ్వడానికి రెడీగా ఉన్నారట.
వినడానికి బాగానే ఉంది ఆధిక్ రవిచంద్రన్ ది డిఫరెంట్ స్టైల్. మన ప్రేక్షకులకు అంత ఈజీగా కనెక్ట్ అవ్వవు. ఒరిజినల్ వెర్షన్లు ఎలా ఆడాయనేది పక్కనపెడితే మార్క్ ఆంటోనీ, గుడ్ బ్యాడ్ అగ్లీ రెండూ తెలుగులో డిజాస్టరయ్యాయి. ఎక్కువగా ఎలివేషన్లు, ట్విస్టింగ్ స్క్రీన్ ప్లే మీద ఆధారపడే ఈ యువ దర్శకుడు బాలయ్య స్వాగ్ ని ఎలా ఒడిసిపట్టుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి గాసిప్ స్టేజిలోనే ఉంది కాబట్టి నిర్ధారణ చెప్పలేం. అఖండ 2 అయ్యాక బాలకృష్ణ వెంటనే గోపీచంద్ మలినేని సినిమాతో బిజీ కాబోతున్నారు. ఆ తర్వాత ఆదిత్య 999 మ్యాక్స్ సిద్ధంగా ఉంటుంది. అనిల్ రావిపూడి కూడా ఒక స్టోరీ సిద్ధం చేస్తున్నారట.
ఇంత టైట్ షెడ్యూల్ లో బాలయ్య తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం విశేషమే. ఫ్యాన్స్ కోణంలో చూస్తే ఇలాంటి కలయికలు జరగడం అవసరమే. అఖండ నుంచి బాలకృష్ణ గేరు మార్చి కొత్త తరం దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే కోలీవుడ్ డైరెక్టర్లకు ఎస్ చెప్పడం చాలా అరుదు. ఆ మధ్య కేఎస్ రవికుమార్ కు రూలర్ ఇచ్చాక మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆధిక్ రవిచంద్రన్ కనక ఒప్పిస్తే క్రేజీ కాంబినేషన్ అవుతుంది. పూర్తి వివరాలు తేలడానికి ఇంకా టైం పడుతుంది. ఒకవేళ ఇది ఓకే కాకపోతే ఆధిక్ ఆటోమేటిక్ గా అజిత్ కొత్త స్క్రిప్ట్ కు షిఫ్ట్ అయిపోవచ్చు.
This post was last modified on May 13, 2025 5:08 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…