మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ అంటే ఫాన్స్ ఖుష్ అయిపోవాలి. అంత టాలెంటెడ్ హీరోయిన్ లీడ్ రోల్ చేస్తే సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అయితే ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ నటించడం పట్ల మహేష్ ఫాన్స్ ఆనందంగా లేరు. ఆమెను మార్చేసి ఎవరినైనా పెడితే బాగుంటుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పెంగ్విన్ ఏదో మిస్‍ఫైర్ అనుకుని సర్దుకుపోయినా కానీ మిస్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ లుక్స్, తన పర్‍ఫార్మెన్స్ మాత్రం ఎవరికీ నచ్చడం లేదు.
గతంలో కాస్త బొద్దుగా వుండే ఫిజిక్‍ను మెయింటైన్ చేసిన కీర్తి సురేష్ అదే లుక్‍తో పలు తమిళ చిత్రాల్లో నటించి అక్కడి వారిని కూడా మెప్పించింది. మరేమయిందో సడన్‍గా జీరో సైజ్‍కి మారిపోయి తన ముఖంలోని కళ కోల్పోయింది. మిస్ ఇండియా సినిమా కోసం సన్నబడ్డానని చెప్పినా కానీ అందులో ఆమె అలా కనిపించాల్సిన అవసరమయితే లేదు మరి.
ఇదిలావుంటే ఆమె సినిమాలు గుడ్‍లక్ సఖి, రంగ్ దే కూడా ఓటిటి ద్వారా రిలీజ్ అవుతాయనే టాక్ వుంది. దీంతో ఆమెకి వున్న మహానటి ఇమేజ్ కరిగిపోయి మామూలు హీరోయిన్ అయిపోతుందని, కనీసం మహేష్ సినిమా కోసమయినా ఆమె కాస్త బరువు పెరిగి ‘నేను లోకల్’ లుక్ సంతరించుకుంటే బాగుంటుందని సూపర్‍స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. సాధారణంగా కష్టపడి బరువు తగ్గిన వాళ్లు అంత తేలిగ్గా బరువు పెరగడానికి ఇష్టపడరు. మరి ఈ ఫీడ్‍బ్యాక్ కీర్తి చెవిన వడుతోందో లేదో తెలీదు.
This post was last modified on November 6, 2020 8:08 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…