ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే స్క్రిప్ట్ పనులు మొదలుపెడతానంటూ పదే పదే చెప్పుకోవడం మీడియాలో హైలైట్ అవుతోంది. ముందు కర్ణుడి పాత్రను ఆధారంగా చేసుకుని దాన్ని హైలైట్ చేస్తామని అన్నారు. తాజాగా కృష్ణుడి క్యారెక్టర్ తనకు ఎంతో ఇష్టమని, ఎంతో స్ఫూర్తినిస్తుందని మరో చోట చెప్పారు. ఇలా తరచు మాటలు మారుస్తున్న అమీర్ భాయ్ నిజంగా అంత గ్రాండ్ స్కేల్ మీద భారతాన్ని తెరకెక్కిస్తాడా అనేది వేయి డాలర్ల ప్రశ్న. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇతరత్రా కారణాలు కనిపిస్తున్నాయి.
జూన్ 20 విడుదల కాబోతున్న సితారే జమీన్ పర్ మీద అమీర్ ఖాన్ కు బోలెడు ఆశలున్నాయి. తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే సినిమా అవుతుందని గంపెడు నమ్మకంతో ఉన్నాడు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ యూత్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కి మంచి బజ్ ఉంది కానీ మరీ భీభత్సంగా అయితే లేదు. లాల్ సింగ్ చద్దా కొట్టిన దెబ్బకు అమీర్ ఇమేజ్ ప్లస్ మార్కెట్ లెక్కల్లో కొన్ని మార్పులు వచ్చాయి. అందులోనూ సితారే జమీన్ పర్ మాస్ ఆడియన్స్ ని ఆకర్షించే కమర్షియల్ సబ్జెక్టు కాదు. సో ఓపెనింగ్స్ తో మొదలుపెట్టి టాక్ దాకా ఎన్నో అంశాలు బాక్సాఫీస్ రన్ ని ప్రభావితం చేయబోతున్నాయి.
ఇదంతా దృష్టిలో పెట్టుకునే మహాభారతం టాపిక్ తీసుకురావడం ద్వారా జనాల అటెన్షన్ తనమీదకు వచ్చేలా అమీర్ ఖాన్ చేసుకుంటున్నాడనేది ఒక బాలీవుడ్ వర్గం విశ్లేషణ. దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. రన్బీర్ కపూర్ రామాయణం ఒకపక్క భారీగా తెరకెక్కుతూ హాట్ టాపిక్ గా మారిన తరుణంలో ఇప్పుడీ మహాభారతాన్ని తాను తీస్తానని అమీర్ ఖాన్ నొక్కి చెప్పడం పలు రకాల అనుమానాలకు తెరతీస్తోంది. అంత రాజమౌళి వల్లే ఎప్పటి నుంచో అనుకుంటున్న మహాభారతం సాధ్యపడలేదు. మరి చెప్పినంత తేలిగ్గా అమీర్ ఖాన్ తన కలల ప్యాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తాడా. ఏమో డౌటే.
This post was last modified on May 9, 2025 9:31 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…