అదేమీ పాతిక కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో నటించిన సినిమా కాదు. పోనీ దర్శకుడికి ప్యాన్ ఇండియాలు తీసిన అనుభవం ఉందా అంటే అదీ లేదు. పట్టుమని పాతికేళ్ళు లేని కుర్రాడు. క్యాస్టింగ్ లో రకరకాల భాషలకు చెందిన ఆర్టిస్టులతో కలర్ ఫుల్ గా ఉందాని అడిగితే సమాధానం నో. మొత్తం అరవ నటీనటులే. అయినా సరే టూరిస్ట్ ఫ్యామిలీ ఈ పరిమితులన్నీ దాటుకుని వసూళ్ల రచ్చ చేస్తోంది. మొన్న శుక్రవారం సూర్య రెట్రో, నాని హిట్ 3 ది థర్డ్ కేస్ తో పాటు విడుదలైన ఈ చోటా ఎంటర్ టైనర్ కేవలం తమిళంలో మాత్రమే రిలీజైనప్పటికీ కలెక్షన్ల పరంగా వీక్ డేస్ లో మిగిలిన వాటిని డామినేట్ చేస్తోంది.
సోమవారం బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే టూరిస్ట్ ఫ్యామిలీకి నిన్న 66 వేల టికెట్లు అమ్ముడుపోగా, హిట్ త్రీకి 59 వేలు, రెట్రోకి 35 వేల టికెట్లు సేలయ్యాయి. కేవలం ఒక భాషలోనే రిలీజ్ చేసిన చిన్న చిత్రం ఇంత రచ్చ చేస్తే మల్టీ లాంగ్వేజెస్ లో వచ్చిన మిగిలిన రెండూ దానికన్నా కింది స్థాయిలో ఉండటం గమనార్హం. ఇటీవలి కాలంలో నిర్మాతలు తమ సినిమాలు బాగా ఆడకపోతే ఆ నెపాన్ని సీజన్, రివ్యూలు, క్రికెట్, ఎండల మీదకు తోసేస్తున్నారు తప్ప తమ లోటుపాట్లని విశ్లేషించుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో చాలా స్పష్టంగా టూరిస్ట్ ఫ్యామిలీ, హిట్ 3 నిరూపిస్తున్నాయి.
ఇప్పుడీ స్మాల్ సెన్సేషన్ ని కొనేందుకు టాలీవుడ్ నుంచి పోటీ ఏర్పడిందని సమాచారం. కొందరు డబ్బింగ్ హక్కుల కోసం సంప్రదిస్తుండగా మరికొందరు రీమేక్ రైట్స్ అడుగుతున్నారట. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని వినికిడి. ఒకవేళ అలా చేసే పనైతే అనువాదం చేయడమే ఉత్తమం. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సోల్ ని తెలుగులో మళ్ళీ పునఃసృష్టించడం కష్టం. పైగా శ్రీలంక వలసవాదుల ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కాబట్టి అంత ఈజీగా కనెక్ట్ కాదు. కామెడీ, ఎమోషన్స్ సరైన రీతిలో బ్యాలన్స్ చేయగలిగితే ఎంత గొప్ప ఆదరణ దక్కుతుందో టూరిస్ట్ ఫ్యామిలీ గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే కంటెంటే కింగు.
This post was last modified on May 6, 2025 11:51 am
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…
2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా…
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…