Movie News

శ్రీవిష్ణు ‘సింగిల్’కు డబుల్ ఛాన్స్

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హీరో ఇమేజ్, మార్కెట్, క్యాస్టింగ్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది సింగిల్ కే. యూత్ ని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు విపరీతమైన క్రేజ్ లేదు. కానీ కంటెంట్ క్లిక్ అయ్యి ఉదయం ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కనక మ్యాడ్ స్క్వేర్ కన్నా మెరుగ్గా థియేటర్లను నింపే కెపాసిటీ శ్రీవిష్ణుకి ఉంది. గతంలో సామజవరగమనతో ఋజువయ్యింది. తర్వాత స్వాగ్ అంచనాలు అందుకోలేకపోయినా ఒక వెరైటీ ప్రయోగం చేశాడన్న సంతృప్తి ఫ్యాన్స్ లో మిగిలింది. అయితే సింగిల్ ఎలాంటి రిస్క్ చేయని ఒక వినోదాత్మక చిత్రం కావడంతో టీమ్ ధీమాగా ఉంది.

పోటీలో సమంత నిర్మించిన శుభం ఉంది కానీ పోలికల పరంగా ఎలా చూసుకున్నా సింగిల్ కన్నా వెనుకబడే ఉంటుంది. అయితే శుభం దర్శకుడు ప్రవీణ్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన భీభత్సమైన స్టేట్ మెంట్లు చూస్తుంటే మ్యాటర్ ఏదో గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తోంది. సింగిల్ డైరెక్టర్ కార్తీక్ రాజు కూడా అంతే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు కానీ దాన్ని మరీ ఆ స్థాయిలో బయట పెట్టుకోవడం లేదు. ఇంకోవైపు జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ కు వైజయంతి సంస్థ చేస్తున్న ప్రమోషన్లు బాగానే వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. అయితే దీని ప్రభావం మహా అయితే వీకెండ్ వరకే ఉండొచ్చనేది ట్రేడ్ వర్గాల అంచనా.

హిట్ 3 ది థర్డ్ కేస్ వీక్ డేస్ లో నెమ్మదించినా తిరిగి వారాంతంలో పుంజుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సింగిల్ కు యునానిమస్ టాక్ రావడం అవసరం. కన్నప్ప మీద వ్యంగ్యంగా డైలాగులు పెట్టారనే వివాదం ఎక్కువ ముదరకుండా సారీ చెప్పేసిన శ్రీవిష్ణు ఇప్పుడు ప్రమోషన్లను మరింత వేగవంతం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. ఎలాగూ మే నెలలో ఇంకే చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. సో సింగిల్ కు ఎంతలేదన్నా రెండు మూడు వారాల స్పేస్ దొరుకుతుంది. కాకపోతే దాన్ని సరైన రీతిలో వాడుకోవాలి. మే 30 కింగ్ డమ్ వచ్చే దాకా పెద్ద గ్యాప్ ఉంటుంది. టాక్ తెచ్చుకుంటే చాలు సింగిల్ మంచి లాభాలు అందుకోవచ్చు.

This post was last modified on May 6, 2025 11:20 am

Share

Recent Posts

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

40 minutes ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

3 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

4 hours ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

4 hours ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

5 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

6 hours ago