నిన్న సూర్య రెట్రోతో పాటు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ కోలీవుడ్ లో దీని మీద మంచి బజ్ ఉంది. డిస్ట్రిబ్యూటర్లకు ముందే ప్రీమియర్లు వేసి చూపించి మరీ సినిమాను అమ్మారంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రెట్రో లాంటి ప్యాన్ ఇండియా మూవీతో పోటీ ఎందుకని పలువురు నిలువరించినా ఓటిటి అగ్రిమెంట్ కోసం ఇష్టం లేకపోయినా క్లాష్ కు సిద్ధపడిన టూరిస్ట్ ఫ్యామిలీకి అనూహ్యంగా సూపర్ హిట్ టాక్ దక్కింది. విమర్శకులు, ప్రేక్షకులు యునానిమస్ గా మెచ్చుకున్నారు. అండర్ డాగ్ గా వచ్చిన ఈ ఎంటర్ టైనర్ చివరిగా విజేతగా నిలుస్తోంది.
అంతగా ఏముందో చూద్దాం. ఇదొక సింపుల్ కథ. శ్రీలంక నుంచి ఫేక్ డాక్యుమెంట్ల సహాయంతో తమిళనాడుకు వలస వచ్చిన ధర్మ దాస్ (శశికుమార్) తన భార్య (సిమ్రాన్), ఇద్దరు కొడుకులతో ఒక కాలనీలో దిగుతాడు. విచిత్ర మనస్తత్వాలు ఉండే ఆ వీధిలో మెల్లగా కలిసిపోతాడు. రకరకాల వ్యక్తుల పరిచయాలు, వాళ్ళ భావోద్వేగాలు, సమస్యలు అన్నింటిలో భాగమయ్యేందుకు ప్రయత్నిస్తాడు. అలా సాగుతున్న ఈ ఫ్యామిలీ ప్రయాణం ఏ మజిలీకి చేరుకుంది, ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయనేది తెరమీద చూస్తే బాగుంటుంది. సింపుల్ ఎమోషన్స్ తో, హడావిడి లేని క్లీన్ కామెడీతో సాగే ఎంటర్ టైనర్ ఇది.
దర్శకుడు అబిషణ్ జీవింత్ చిన్న వయసు యువకుడు. అయినా కూడా ఒక లైటర్ వీన్ స్టోరీని ఇంత హత్తుకునేలా తీయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. శశికుమార్, సిమ్రాన్, యోగిబాబు లాంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు కమలేష్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ తోనూ అద్భుతమైన పెర్ఫార్మన్స్ రాబట్టుకున్న వైనం ఆకట్టుకుంది. సియోన్ రోల్డాన్ సంగీతం సినిమాకు మరింత వన్నె తీసుకొచ్చింది. శ్రీలంక వలసవాదుల మీద ఇంత వినోదాత్మకంగా వచ్చిన మొదటి సినిమా ఇదేనని చెప్పాలి. కోలీవుడ్ లో ఎంత హిట్టయినా దీన్ని రీమేక్ చేయడం కన్నా డబ్బింగ్ చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు అందిస్తే బాగా రీచ్ అవుతుంది. చూడాలి ఎవరు చేస్తారో.
This post was last modified on May 2, 2025 8:11 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…