కొన్నిసార్లు ఎంత పెద్దవాళ్ళైనా సరే గతం గుర్తొచ్చినప్పుడో లేదా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళినప్పుడో మాటలు జారడమో, దొర్లడమో జరిగిపోతాయి. వాటికి వయసుతో సంబంధం లేదు. ఇవాళ అల్లు అరవింద్ గారిని చూస్తే అదే అనిపిస్తుంది. శ్రీవిష్ణు సింగిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నేను పరమ పోరంబోకునని, రౌడీ బాయ్ లా పెరిగానని, కాకపోతే మనకది సూట్ కాదని గుర్తించి, తర్వాత పెద్ద మనిషిగా మారిపోయి ఇవాళ ఇలా ఉన్నానని చెప్పుకొచ్చారు. మేల్, అల్ఫా మేల్ అంటూ రకరకాల పదాలు ప్రాచుర్యంలో ఉన్న ట్రెండ్ లో పెద్దాయన పోరంబోకుని వాడటం విశేషం.
చాలా సందర్భాల్లో అల్లు అరవింద్ పబ్లిక్ స్టేజి మీద నటీనటులతో హుషారుగా డాన్సులు చేయడం చూశాం. కొన్ని వైరల్ అయితే మరికొన్ని వాట్సప్ గ్రూపుల్లో స్టిక్కర్లుగా మారిపోయాయి. వయసు ఎంత ఉన్నా ఆలోచనల్లో ట్రెండీగా ఉంటారని అరవింద్ కి పేరుంది. ఇప్పుడది మాటల్లో కూడా బయటపడింది. నెటిజెన్ల రియాక్షన్లు దీని పట్ల సహజంగానే అన్ని రకాలుగా ఉంటాయి. కొందరు అప్పట్లోనే మీరు ఇంత ముదురా అంటే, మరికొందరు ఈ ఏజ్ లో ఎందుకొచ్చినవని కామెంట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. సింగిల్ సినిమా కాన్సెప్ట్ కు తగట్టు అల్లు అరవింద్ చెప్పిన సమాధానం కాబట్టి ఆ కోణంలోనే చూడాలి.
మే 9 విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ మీద అరవింద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చేతిలో ఉన్న పది రోజులు ప్రమోషన్లతో హోరెత్తించేందుకు సర్వం సిద్ధం చేశారని గీతా కాంపౌండ్ టాక్. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ లో ఇవాళ్టి సోషల్ మీడియా ట్రెండీ కంటెంట్ చాలా జొప్పించారని విజువల్స్ , డైలాగులు చూస్తే అర్థమైపోయింది. దానికి తగ్గట్టే అల్లు అరవింద్ గారు పోరంబోకు లాంటి పదాలతో మరింత చర్చ జరిగేందుకు ఛాన్స్ ఇచ్చారని అనుకోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ ఇకముందు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో ఆ పోరంబోకు పనులేవో రెండు మూడు శాంపిల్స్ చెప్పాలని ఫ్యాన్స్ కోరికట.
This post was last modified on April 28, 2025 7:52 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…