Movie News

శ్రీవిష్ణు మార్క్ ‘సింగిల్’ కామెడీ

గత ఏడాది స్వాగ్ తో పలకరించిన శ్రీవిష్ణు తనను ప్రత్యేకంగా అభిమానించే ఫ్యాన్స్ ని మెప్పించాడు కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాడు. తన బలమైన కామెడీ టైమింగ్ ని సామజవరగమన తరహాలో మళ్ళీ చూపించాలని ప్రేక్షకులు కోరుకుంటున్న టైంలో సింగిల్ గా రాబోతున్నాడు. మే 9 విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందడం విశేషం. కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. రిలీజ్ ఇంకో పదకొండు రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. ఇవాళ ట్రైలర్ లాంచ్ ద్వారా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.

అనగనగా ఒక అబ్బాయి (శ్రీవిష్ణు). సింగిల్ గా ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అమ్మాయిలను పడేసే విషయంలో తనకంటూ స్వంత ఫిలాసఫీ ఉంటుంది. ఓ మంచి ముహూర్తంలో పూర్వ (కేతిక శర్మ) ని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టం ఉండదు. ఇంకోవైపు హరిణి (ఇవానా)  ఈ సింగిల్ మీద మనసు పారేసుకుకుంటుంది. తనొకరిని లవ్ చేస్తే వేరొకరు తనను లైక్ చేయడం సింగిల్ కి అంతు చిక్కదు. తర్వాత ఏమయ్యిందో తెరమీద చూడమంటున్నారు. లైన్ గా చూస్తే ఇది పాత కథలా అనిపించినా బోలెడు ఫన్, కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్స్ తో కార్తీక్ రాజ్ ఫ్రెష్ గా చెప్పే ప్రయత్నం కనిపించింది.

ముఖ్యంగా సోషల్ మీడియా ట్రెండ్ ని ఫాలో అవుతూ అల్ఫా మేల్ అంటూ యానిమల్ రిఫరెన్స్, శివయ్యా అంటూ కన్నప్పలో మంచి విష్ణు ఇమిటేషన్ అన్నీ నవ్వు తెప్పించేలా ఉన్నాయి. తుమ్మితే ఎంత రిచ్ అయినా హాచ్ అంటాడని వెన్నెల కిషోర్ తో చెప్పించిన డైలాగులు బాగా పేలాయి. యూత్ కామెడీతో శ్రీవిష్ణు తన మార్కు మళ్ళీ చూపించాడు. ఇంతే మోతాదులో పూర్తి సినిమా ఉంటే మాత్రం థియేటర్లకు కుర్రాళ్ళు క్యూ కట్టడం ఖాయం. మే 9 రిలీజవుతున్న సింగిల్ మీద మంచి అంచనాలు నెలకొనేలా ట్రైలర్ దోహదం చేసింది. మిగిలిన బాధ్యతని ఇంతే స్థాయిలో అసలు సినిమా నెరవేరిస్తే హిట్టు పడ్డట్టే.

This post was last modified on April 28, 2025 4:59 pm

Share

Recent Posts

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

10 minutes ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

2 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

4 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

7 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

10 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

10 hours ago