Movie News

రెండేళ్ల గ్యాప్…సమంత ‘శుభం’ కార్డు

రెండేళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైపోయిన సమంతా ఎట్టకేలకు వెండితెర మీద కనిపించబోతోంది. అది కూడా డ్యూయల్ రోల్ లో. అంటే నటిగా కాదు లెండి. నిర్మాతగా ప్లస్ క్యామియో చేసిన యాక్టర్ గా. ఆమె ప్రొడక్షన్ లో నిర్మాణమైన మొదటి సినిమా శుభం మే 9 విడుదల కానుంది. హరిహర వీరమల్లు తప్పుకోవడంతో ఆ స్లాట్ పట్టేసిన సామ్ తన అభిరుచిని కంటెంట్ లోనూ చూపిస్తోంది. ఇవాళ ట్రైలర్ లాంఛ్ చేశారు. నోటెడ్ క్యాస్టింగ్ లేకుండా దాదాపు అందరూ కొత్తగా వాళ్ళతో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో వెరైటీ పాయింట్ తీసుకున్నారు. ప్రవీణ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథేంటో చెప్పేశారు.

ముగ్గురు కుర్రాళ్లు కొత్తగా పెళ్లి చేసుకుంటారు. ఆ భార్యలకేమో టీవీ సీరియళ్ళు అంటే మహా పిచ్చి. రాత్రి తొమ్మిది కావడం ఆలస్యం పిడుగులు పడుతున్నా సరే చూడటం మిస్ చేసుకోరు. ఆఖరికి శోభనం రోజు కూడా. అయితే ఇది కేవలం అక్కడితో ఆగిపోదు. ఆ సీరియల్ మహత్యమో ఇంకేదైనా బ్రహ్మ రహస్యమో ఏమో కానీ ఈ ఆడాళ్ళకు దెయ్యం పూనుతుంది. మొగుళ్లను కొట్టడం మొదలెడతారు. ఇది తమ సమస్య అనుకుంటే ఊళ్ళో చాలా మందికి ఉందని తెలుస్తుంది. అప్పుడు ఎంట్రీ ఇస్తుంది ఒక లేడీ బాబా (సమంత). ఇంతకీ ఈ భూతాల గోలేంటి, ఆ సీరియల్ చూడటం వల్ల వాళ్లు ఎందుకిలా అయ్యారనేది తెరమీద చూడాలి.

చూస్తుంటే సమంతది ప్రాధాన్యం కలిగిన గెస్టు రోల్ గా కనిపిస్తోంది. సస్పెన్స్ లో పెట్టకుండా ఆమె క్యారెక్టర్ ని రివీల్ చేయడం ద్వారా ఫ్యాన్స్ కు ముందే హింట్ ఇచ్చారు. షోర్ పోలీస్ సంగీతం సమకూరుస్తున్న శుభంకు మొత్తం యూత్ టాలెంట్ పని చేశారు. నటీనటులు, టెక్నీషియన్లు అంతా వాళ్లే. హిట్ 3 విడుదల కాగానే దీనికి సంబంధించిన ప్రమోషన్లు స్పీడప్ చేసేందుకు సమంత పక్కా ప్లానింగ్ తో ఉందట. అదే రోజు శ్రీవిష్ణు సింగల్ తో పాటు జగదేకవీరుడు అతిలోకసుందరి 3డి రీ రిలీజ్ ఉన్నాయి. టైటిల్ దగ్గరి నుంచి కాన్సెప్ట్ దాకా విభిన్నంగా అనిపిస్తున్న శుభం ఆడియన్స్ ని మెప్పిస్తే ప్రొడ్యూసర్ గా సామ్ కి హిట్టు పడ్డట్టే

This post was last modified on April 27, 2025 10:46 am

Share

Recent Posts

దర్శకుడికి రిలీఫ్.. సినిమాకు రిలీజ్ డేట్

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు అతడికి…

7 hours ago

యూట్యూబర్ వైష్ణ‌వి భ‌ర్త‌ను న‌డిరోడ్డుపై న‌రికి చంపారు

యూట్యూబ్ వీడియోల ద్వారా చాలా చిన్న వ‌య‌సులోనే మంచి పాపులారిటీ సంపాదించిన వైష్ణ‌వి అనే తెలంగాణ అమ్మాయి ఈ ఏడాది…

7 hours ago

రాకా 37.. ఏమిటబ్బా?

అల్లు అర్జున్ ఒక కొత్త సినిమా మొదలుపెట్టాడు అంటే ప్రమోషన్ల పరంగా మొదట్నుంచి బాగా హడావుడి ఉంటుంది. రెగ్యులర్‌గా అప్‌డేట్స్…

8 hours ago

ఒక్క‌డై వ‌చ్చి.. ఒంట‌రిగా.. ఆళ్ల నాని ఫ్యామిలీ పాలిటిక్స్ ఎండ్‌..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆళ్ల కాళీకృష్ణ…

8 hours ago

ఎఫ్ బీఐని ఏపీ పోలీసులు దుర్వినియోగం చేశారు: జగన్

అమెరికా ఎఫ్‌బీఐ పేరుతో సోషల్ మీడియా పోస్టుల తొలగింపునకు ఎక్స్ కు అభ్యర్థనలు పంపారని ఏపీ పోలీసులపై, ఎన్డీఏ ప్రభుత్వంపై…

9 hours ago

దసరా క్లాష్…..సీనియర్ VS జూనియర్

వాయిదాల పుకార్లు ఎన్ని తిరుగుతున్నా మా పని మాదే అన్న తరహాలో దసరా విడుదలని టార్గెట్ చేసుకున్న రెండు ప్యాన్…

11 hours ago