Movie News

300 కోట్ల సినిమా…థియేటర్లో హిట్…ఓటిటిలో ఫట్

థియేటర్లో వచ్చినప్పుడు ఎల్2 ఎంపురాన్ కు జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. వివాదాలు చుట్టుముట్టాయి. కేంద్ర అధికార పార్టీని ఇబ్బంది పెట్టేలా కొన్ని పాత్రలు, సన్నివేశాలు ఉన్నాయనే కాంట్రావర్సి రేగింది. ఒక మతాన్ని టార్గెట్ చేసుకున్నారని సామజిక కార్యకర్తలు భగ్గుమన్నారు. నిరసనలకు భయపడి మోహన్ లాల్ ఏకంగా క్షమాపణ చెప్పి, అబ్జెక్షన్ వచ్చిన వాటికి కత్తిరింపులు వేసి, క్యారెక్టర్ల పేరు మార్చారు. మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి మల్లువుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచిందని ఇటీవలే ప్రకటన ఇచ్చారు. నెల రోజుల తర్వాత ఇటీవలే ఎల్2 ఎంపురాన్ ఓటిటి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు.

ఇంత రచ్చ జరిగినప్పుడు సహజంగానే డిజిటల్ లో చూసే జనాలు అధికంగా ఉంటారు. కానీ ఎల్2 ఎంపురాన్ కు అలాంటి స్పందన కనిపించడం లేదు. దీనికా ఇంత బిల్డప్ ఇచ్చారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఈ సినిమా మలయాళంలో మాత్రమే బాగా ఆడింది. తెలుగుతో సహా ఇతర డబ్బింగ్ వెర్షన్లు డిజాస్టరయ్యాయి. ఇక్కడ పంపిణి చేసిన దిల్ రాజుకి ఏం మిగల్లేదు. కానీ ఎల్2 టీమ్ మాత్రం ప్రతి చోటా గొప్ప విజయం సాధించిందనే తరహాలో ప్రచారం చేసుకున్నారు. సాధారణంగా కేరళలో ఉన్న లేట్ ఓటిటికి ట్రెండ్ కి భిన్నంగా ఎల్2 ఇంత త్వరగా డిజిటల్ లోకి రావడం ఆశ్చర్యం కలిగించింది.

ఇదంతా ఎలా ఉన్నా దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ మాత్రం ఎల్3 ది బిగినింగ్ తీస్తానని చెబుతున్నాడు. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ లాల్ ని హీరోగా పెట్టి లూసిఫర్ ఫ్లాష్ బ్యాక్ ని అందులో చూపించబోతున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యేది చెప్పలేదు కానీ వచ్చే ఏడాది ఉండొచ్చు. అయినా ప్రొడ్యూసర్లు ఎంత హంగామా చేసినా నిజమైన కంటెంట్ బాగుంటేనే థియేటర్, ఓటిటిలో ఆదరణకు నోచుకుంటుంది. అంతే తప్ప ఫలానా వివాదం వచ్చిందనో లేదా సెన్సార్ కత్తిరింపులు ఉంటాయనో ఎగబడి చూడరు. ఇంతా చేసి ఎల్2 ఎంపురాన్ ఓటిటి హక్కులు కింగ్ అఫ్ కోత కన్నా తక్కువకు అమ్ముడుపోవడం ఫైనల్ ట్విస్ట్.

This post was last modified on April 25, 2025 4:37 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

4 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

5 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

5 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

6 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

8 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

9 hours ago