రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి. కానీ ప్రస్తుతానికి అలాంటి సూచనలు లేవు. ముఖ్యంగా టిల్లు తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ చేసిన సినిమాగా ‘జాక్’ మీద భారీ స్థాయిలో బజ్ లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇంకో ఇరవై నాలుగు గంటల లోపే షోలు పడబోతున్నా ఇప్పటిదాకా బుక్ మై షో ట్రెండింగ్ లోకి రాకపోవడం విచిత్రం. గత ఏడాది టిల్లు స్క్వేర్ కి పూర్తి భిన్నమైన పరిస్థితి ఇది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా పాజిటివ్ టాక్ తో ఊపందుకుంటుందనే నమ్మకం జాక్ బృందంలో కనిపిస్తోంది.
ఇక ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి తమిళంలో టికెట్ అమ్మకాలు అదిరిపోతున్నాయి కానీ తెలుగులో రెస్పాన్స్ సోసోగానే ఉంది. గత కొన్నేళ్లుగా అజిత్ మార్కెట్ ఇక్కడ పడిపోతూ వస్తోంది. వలిమై, తెగింపు, పట్టుదల ఇవేవి కనీస స్థాయిలో ఆడలేదు. అందుకే గుడ్ బ్యాడ్ అగ్లీ మీద మన ప్రేక్షకుల్లో ఎగ్జైట్ మెంట్ లేదు. మైత్రి నిర్మాణం కావడంతో మంచి థియేటర్లలో వేస్తున్నా ఇదీ టాక్ మీద ఆధారపడాల్సిందే. గంటకు అయిదు వేల టికెట్లకు పైగా సేలవుతున్నాయి. కాకపోతే అవన్నీ తమిళనాడుకు సంబంధించినవే. ఇక సన్నీ డియోల్ ‘జాట్’ని కేవలం హిందీ వెర్షన్ కే పరిమితం చేయడం ఆడియన్స్ ని కొంత దూరం చేస్తోంది.
గోపీచంద్ మలినేని, జగపతిబాబు, రమ్యకృష్ణ, రెజీనా, తమన్ లాంటి తెలుగు టీమే జాట్ కు పని చేసినా సమయాభావం వల్లనో లేక ఇంకేదైనా కారణం వల్లనో అనువాదం జరగలేదు. ఒకవేళ హిట్ టాక్ వస్తే ఛావా లాగా ఆలస్యంగా చేస్తారేమో తెలియదు కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాలకు ఎక్కువ లేట్ చేయడం అంత సేఫ్ కాదు. ఇవి కాకుండా ఎల్లుండి యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సైతం బజ్ కోసం పోరాడుతోంది. కామెడీ పండిందనే టాక్ వినిపిస్తోంది కానీ ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తేనే ప్రదీప్ థియేటర్ జనాన్ని ఫుల్ చేయగలడు. మరి ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో చూడాలి.
This post was last modified on April 9, 2025 10:51 am
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…