మహేష్ బాబు కెరీర్లో పవర్ ఫుల్ హిట్లలో ‘బిజినెస్‌మేన్’ ఒకటి. ‘పోకిరి’ తర్వాత పూరితో మహేష్ చేసిన ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఐతే తొలి రోజు సినిమాకు డివైడ్ టాక్ రావడంతో సినిమా అనుకున్నంత ఆడుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. కానీ ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ సినిమా సూపర్ హిట్ అయింది. మహేష్ కెరీర్లో మోస్ట్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్‌ల్లో ఒకటిగా ఈ సినిమాను చెప్పొచ్చు.
ఈ చిత్రం దర్శక ధీరుడు రాజమౌళిని ఆశ్చర్యానికి గురి చేసిందట. సినిమా సక్సెస్ మంత్రను వివరిస్తూ తాను రాసిన ఓ పుస్తకాన్ని జక్కన్న.. ఈ సినిమా చూశాక చించి అవతల పారేశాడట. ఈ విషయాన్ని ఆయనతో కలిసి టెన్నిస్ ఆడే ఒక మీడియా పర్సన్ ఓ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించాడు.
సదరు వ్యక్తి పేరేంటో కానీ.. ఆయన రాజమౌళికి టెన్నిస్ మేట్ అట. ఆయన తాజాగా దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా ‘బిజినెస్ మేన్’ ప్రస్తావన తెచ్చారు. తనతో రోజూ టెన్నిస్ ఆడే రాజమౌళి.. సక్సెస్ ఫుల్ సినిమా ఎలా తీయాలి అనే విషయంలో తానొక పుస్తకం రాశానని, అది తనకిస్తానని చెప్పారట. కానీ అంతలో ‘బిజినెస్ మేన్’ రిలీజైందని.. ఆ సినిమా చూశాక ఆ పుస్తకాన్ని చించి పడేశానని రాజమౌళి తెలిపారని ఆయన వెల్లడించారు.
ఈ చిత్రంలో హీరో పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఉంటాయని.. బూతులు మాట్లాడతాడని.. అన్నీ చెడ్డ పనులే చేస్తాడని.. అయినా ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందిందని.. సినిమా సక్సెస్ రూల్స్‌కు ఇది విరుద్ధమన్న ఉద్దేశంతో జక్కన్న తన పుస్తకాన్ని బుట్టదాఖలు చేశారని ఆయన టెన్నిస్ మేట్ తెలిపారు.
This post was last modified on April 8, 2025 2:15 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…