ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక ముందు వరకు దీని గురించి ప్రేక్షకుల్లో పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే ఓదెల రైల్వేస్టేషన్ గా వచ్చిన మొదటి భాగం నేరుగా ఓటిటి రిలీజ్ జరుపుకోవడం, కొంచెం ఏ సర్టిఫికెట్ కంటెంట్ వల్ల కామన్ ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ కాలేదు. కానీ నిర్మాత కం రైటర్ సంపత్ నంది ఈసారి థియేటర్ ని టార్గెట్ చేసుకుని మిల్కీ బ్యూటీ తమన్నాని ఎంచుకోవడం సినిమా ఇమేజ్ పెంచడానికి బాగా ఉపయోగపడింది. రిలీజ్ కు ముందే మొత్తం రికవర్ అయిపోయి లాభాలు కూడా వచ్చాయన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అంకెల సంగతి పక్కనపెడితే ఓదెల 2 మీద ఇంత బజ్ ఏర్పడడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది బాలయ్య అఖండలో అఘోరా క్యారెక్టర్ ని జనం రిసీవ్ చేసుకున్న తీరుని సంపత్ నంది బాగా స్టడీ చేశాడు. ఎలాంటి భీభత్స రూపం లేకుండా హుందాగా దాన్ని బోయపాటి శీను డిజైన్ చేసిన తీరుని స్ఫూర్తిగా తీసుకుని తమన్నా పాత్రకు రూపకల్పన చేసినట్టు కనిపిస్తోంది. వీటికి తోడు శివుడి సెంటిమెంట్, కాశి బ్యాక్ డ్రాప్, గ్రామ దేవతలు, దెయ్యాలు, ఊళ్ళో హత్యలు ఇలా కంప్లీట్ ప్యాకేజీగా రూపొందించిన వైనం మాస్ జనాల్లో ఆసక్తి రేపుతోంది. ఆ నమ్మకమే బయ్యర్లను ఎక్కువ రేట్లు పెట్టేందుకు పురికొల్పుతోంది.
కాంపిటేషన్ పరంగా చూసుకునే ఓదెల 2కి మరుసటి రోజు కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో పాటు ప్రియదర్శి సారంగపాణి జాతకం వస్తున్నాయి. అయితే మూడు దేనికవే సంబంధం లేని జానర్లు కావడం వల్ల టాక్ పాజిటివ్ గా ఉంటే చాలు జనాలు వస్తారు. మండు వేసవిలో వినోదం కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి ఈ నెలలో హరిహర వీరమల్లు, కన్నప్ప, ఘాటీ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు మిస్సయినప్పటికీ ఇప్పుడొచ్చేవి ఆ కొరత తీరుస్తాయనే నమ్మకమైతే నిర్మాతల్లో ఉంది. ఓదెల 2 మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల చేస్తున్నారు. హిందీ వెర్షన్ సైతం బాగా పే చేస్తుందనే ధీమా మేకర్స్ లో ఉంది.
This post was last modified on April 7, 2025 5:45 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…