హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ అదే అనిపిస్తుంది. ఇటీవలే విడుదలైన సికందర్ ఎంత దారుణంగా బోల్తా కొట్టిందో చూస్తున్నాం. వంద కోట్ల గ్రాస్ దాటడంలో ఆశ్చర్యం లేదు కానీ జవాన్, పఠాన్ రేంజ్ లో ఇది రికార్డులు సృష్టిస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్న సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ నమ్మకం నిలువునా నీరుగారిపోయింది. దీంతో ఇంత అత్తెసరు కంటెంట్ తో తమ హీరోతో ఎందుకు ఆడుకున్నారని సాజిద్ ని నిలదీస్తూ సోషల్ మీడియా వేదికగా కొందరు ఫ్యాన్స్ ఎక్స్ లో ట్వీట్లు పెట్టారు. వాటిలో ఘాటైన పదజాలం ఉంది.
దీనికి వార్దా ఖాన్ స్పందిస్తూ ఆ తిట్లు శాపనార్థాలు రీ ట్వీట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో వాళ్ళు రివర్స్ లో ఇలా చేయడం మీకు సిగ్గుగా లేదా అంటూ విరుచుకుపడ్డారు. మీరు త్వరగా కోలుకోవాలంటూ ఆవిడ బదులు ఇవ్వడంతో అగ్గి మరింత రాజుకుంది. మెల్లగా వ్యవహారం ఎటో వెళ్తోందని గుర్తించిన వార్దా తర్వాత వాటిని డిలీట్ చేయడం క్లైమాక్స్. నిజానికి సినిమా బాలేదన్నది ఓపెన్ సీక్రెట్. దాపరికం ఏం లేదు. వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని థియేటర్ కొచ్చిన జనం తమకు చిరాకనిపిస్తే తిడతారు. అది సహజం. టికెట్ రూపంలో వాళ్ళకా హక్కు సంక్రమిస్తుంది. దాన్ని ఎగతాళి చేయకూడదు.
ఇలా రెచ్చగొడుతూ ఉంటే ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ చేస్తారు. కొందరు ఒక అడుగు ముందుకేసి సల్మాన్ ఇలాంటి చెత్త కథలు ఎంచుకోవడంలో వార్దాఖాన్ ప్రమేయం ఉందని చెప్పడం గొడవని ఇంకో మలుపు తిప్పింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సికందర్ వాషౌట్ అయ్యింది. రంజాన్ సీజన్ కాబట్టి ఈ మాత్రం వసూళ్లు దక్కాయి లేదంటే ఏదైనా పోటీలో వచ్చి ఉంటే జరిగే నష్టం ఊహించుకోవడం కష్టమే. ఇంకా మొదటి వారంలో ఉండగానే చాలా చోట్ల షోలు క్యాన్సిలవుతున్న స్థితిలో సికందర్ కనీసం రెండు వందల కోట్ల గ్రాస్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదైతే జరిగేలా లేదు.
This post was last modified on April 3, 2025 5:38 pm
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…