టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ కెరీర్లో మిగతా చిత్రాలన్నీ ఒకెత్తయితే.. పుష్ప, పుష్ప-2 మరో ఎత్తు. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించి ఆయన స్థాయిని అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా పుష్ప-2కు వచ్చిన హైప్.. ఆ సినిమా సాధించిన వసూళ్లు ఒక చరిత్ర. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రను సుకుమార్ మలిచిన తీరు.. ఆ పాత్రలో బన్నీ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమే. మరి సుకుమార్‌కు ఛాయిస్ ఇచ్చి.. తమిళ సినీ పరిశ్రమ నుంచి పుష్ప పాత్ర కోసం ఒకరిని ఎంచుకోమంటే ఆయన ఏం సమాధానం చెప్పారన్నది ఆసక్తికరం.
చెన్నైలో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ దర్శకుడిగా పురస్కారం అందుకున్న సందర్భంగా సుకుమార్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. విజయ్, అజిత్ లాంటి టాప్ స్టార్లలో పుష్ప పాత్ర కోసం ఎవరిని ఎంచుకుంటారు అని అడిగితే.. ఈ ఇద్దరు హీరోల చిత్రాలు తాను చాలా తక్కువగా చూశానని సుకుమార్ చెప్పాడు. వీరి కంటే తాను కార్తిని పుష్ప పాత్ర కోసం ఎంచుకుంటానని చెప్పి ఆశ్చర్యపరిచారు సుకుమార్. కార్తి ముఖంలో హావభావాలు ఎప్పుడూ కదులుతూ ఉంటాయంటూ అతడికి కితాబిచ్చాడు సుకుమార్. ఇక పుష్ప టైటిల్ వెనుక కథను కూడా సుకుమార్ ఈ వేదికలో పంచుకున్నాడు.
నిజానికి పుష్ప కథతో సినిమా తీయాలనుకోలేదని… ఎర్రచందనం స్మగ్లింగ్ మీద వెబ్ సిరీస్ చేయాలనుకున్నానని.. దీనికి సంబంధించిన రీసెర్చ్‌లో భాగంగా అనేకమంది స్మగ్లర్లను కూడా కలిశానని.. అందులో ఒక స్మగ్లర్ పేరు పుష్ప రాజ్ అని.. తనను అందరూ పుష్ప అని పిలుస్తారని.. ఈ కథతో సినిమా తీయాలనుకున్నాక తన పేరునే సినిమాకు టైటిల్‌గా పెట్టామని సుకుమార్ వెల్లడించాడు.
ఈ కార్యక్రమంలో తనకు దర్శకుడిగా ఎంతో స్ఫూర్తినిచ్చిన మణిరత్నం గురించి సుకుమార్ మాట్లాడాడు. ఆయన తీసిన గీతాంజలి సినిమా చూసే తాను సినీ రంగంలోకి వచ్చానని.. తాను దర్శకుడు కావడానికి కారణమైన ఆయనకు ఈ వేదిక మీది నుంచి కృతజ్ఞతలు చెబుతున్నానని సుకుమార్ అన్నాడు.
This post was last modified on April 3, 2025 10:13 am
పెద్ది టీజర్ వచ్చాక ఎన్నో టాపిక్స్ మీద చర్చ జరుగుతోంది. దీనికి ప్యారడైజ్ కి రిలీజ్ డేట్ల క్లాష్ గురించి…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ రజతోత్సవాలకు రెడీ అయింది. ఈ నెల 27వ తేదీకి బీఆర్ ఎస్(అప్పటి…
డోలీ మోతలు... గిరిజన గూడేల్లో నిత్యం కనిపించే కష్టాలు. పట్టణ ప్రాంతాలు ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. పూర్తిగా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న…
నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అమిగోస్, డెవిల్…
కమ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సారథి వచ్చారు. తమిళనాడులో జరుగుతున్న 24వ అఖిల భారత మహా సభల వేదికగా.. కొత్త…
బాలీవుడ్ ఆల్ టైం టాప్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ వస్తే చాలు.. వందల…