కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు నిమిషాల ఫుటేజ్ డిలీట్ తో కొత్త వెర్షన్ తో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ రికార్డులతో పాటు మల్లువుడ్ లో సరికొత్త మైలురాళ్ళు నమోదు చేసిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇతర భాషల్లో డిజాస్టర్ అయ్యింది. తెలుగు, హిందీ, తమిళ ఆడియన్స్ దీన్ని లైట్ తీసుకున్నారు. మొదటిరోజు ఓ మోస్తరుగా డీసెంట్ వసూళ్లు దక్కాయి కానీ తర్వాత విపరీతంగా నెమ్మదించిపోయింది. పంపిణి చేసిన దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలు చూసే అవకాశమే లేదని ట్రేడ్ టాక్.
ఇదిలా ఉండగా ఇంత రచ్చ జరిగినా మూడో భాగం ఆపడం లేదట. ఎల్3 ది బిగినింగ్ పేరుతో థర్డ్ పార్ట్ ని త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్. అయితే ఇందులో హీరో మోహన్ లాల్ కాదు. ఆయన కొడుకు ప్రణవ్ మోహన్ లాల్. 1982 ప్రాంతంలో అబ్రహం ఖురేషి అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ లూసిఫర్ ముంబై నగరానికి వచ్చి ఏం చేశాడు, ప్రపంచమంతా విస్తరించే మాఫియాని ఎలా గుప్పిట్లో పెట్టుకున్నాడనే పాయింట్ మీద చాలా ఇంటెన్స్ గా తీస్తారట. ఎల్2 ఎండ్ టైటిల్స్ ముందు చూపించిన ఎపిసోడ్ లో రక్తంతో కనిపించిన యువకుడు ప్రణవే.
కేవలం కాసేపు మాత్రమే మోహన్ లాల్ ఎల్3 లో ఉంటారట. ఈసారి కాంట్రావర్సి ఎక్కువ కాకుండా స్క్రిప్ట్ స్టేజిలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారని తెలిసింది. అయితే ఇలా ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్రను కొడుకు పోషించడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో గాయత్రిలో మోహన్ బాబు, మంచు విష్ణు ఈ ప్రయోగం చేశారు కానీ ఫలితం దక్కలేదు. కాకపోతే ఈ ఎక్స్ పరిమెంట్ లో తండ్రి కొడుకులు ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఛాన్స్ ఉండదు. సో మోహన్ లాల్, ప్రణవ్ ని ఒకేసారి తెరమీద చూడలేం. అన్నట్టు ఎల్3 బిగినింగ్ తర్వాత ఎల్4 ది కంక్లూజన్ చివరిదట. అందులో ఇంకేం చూపిస్తారో పృథ్విరాజ్ కే తెలియాలి.
This post was last modified on April 2, 2025 9:57 pm
ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ…
దేశంలో `వన్ నేషన్-వన్ ఎలక్షన్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాలని.. కేంద్రం తలపోస్తున్న విషయం తెలిసిందే. దీనిపై…
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…
టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…
మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…
సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని..…