గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక మందన్నా. ‘యానిమల్’ తర్వాత ఆమె ఫోకస్ బాలీవుడ్ మీద పడింది. ఈ క్రమంలో కొన్ని సౌత్ సినిమాలను సైతం వదులుకుంది. అలా ఆమె ఓకే చేశాక బయటికి వచ్చిన ప్రాజెక్టుల్లో ‘రాబిన్ హుడ్’ ఒకటి.
‘భీష్మ’ లాంటి హిట్ తర్వాత నితిన్-వెంకీ కాంబినేషన్లో చేయాల్సిన సినిమా నుంచి ఆమె బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తన నిర్ణయం కరెక్టే అని ఇటీవల ఈ సినిమా ఫలితం చూశాక అర్థమైంది. ‘రాబిన్ హుడ్’ బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఇందులో హీరోయిన్ పాత్రను చూస్తే రష్మిక ఈ సినిమా వదలిలేయడం మంచి నిర్ణయమే అనిపించింది. కానీ ఈ సినిమా నుంచి లక్కీగా బయటపడ్డ రష్మిక.. ఇదే సమయంలో రిలీజైన మరో చిత్రంతో ఎదురు దెబ్బ తింది.
రష్మిక హిందీలో నటించిన భారీ చిత్రం ‘సికందర్’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఫామ్‌లో లేని మురుగదాస్, సల్మాన్ ఖాన్ కలిసి ఈ సినిమా చేయడంతో ముందే దీని మీద అనుమానాలున్నాయి. ఆ అనుమానాలకు తగ్గట్లే సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. ఈ చిత్రంలో రష్మికది కీలక పాత్రే అయినా.. దాని ఇంపాక్ట్ ఏమీ లేదు. రష్మిక లుక్స్, నటన పట్ల అందరూ విమర్శలే చేస్తున్నారు. ఈ సినిమా వల్ల రష్మికకు ఏమాత్రం ప్రయోజనం లేదనే చెప్పాలి.
‘యానిమల్’ తర్వాత రష్మిక నటించిన హిందీ మూవీ ‘ఛావా’ భారీ హిట్ అయినా.. ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు ‘సికందర్’ అన్ని రకాలుగా నిరాశపరిచింది. ఇక ఆమె ఆశలన్నీ సౌత్ సినిమాలైన ‘కుబేర’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ మీదే ఉన్నాయి. అవి పెద్ద సినిమాలు కాకపోయినా రష్మికకు మంచి పేరు, బ్రేక్ అందించేలా కనిపిస్తున్నాయి.
This post was last modified on March 31, 2025 9:05 pm
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…