అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకున్న ఎల్2 ఎంపురాన్ కంటెంట్ గురించి అభ్యంతరాలు తలెత్తి దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి మురళి మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే అభిమన్యు సింగ్ పోషించిన విలన్ పాత్రని హిందువుగా చూపించి ఇతర మతం బాధితులపై దారుణాలకు తెగబడినట్టు తప్పుడు సందేశం ఇచ్చారని పలువురు అభ్యంతరాలు లేవనెత్తారు. ఇది కాస్తా కోర్టుకి వెళ్లి లేనిపోని తలనెప్పులు తెస్తుందనిపించి టీమ్ రిపేర్లు చేసే పనిలో పడింది. తాజాగా అబ్జెక్షన్ అనిపించిన 17 కత్తిరింపులతో కొత్త వెర్షన్ రీ సెన్సార్ చేయించినట్టు మల్లువుడ్ సమాచారం.
కొన్ని పాత్రల పేరు మార్చడంతో పాటు కాంట్రవర్సీకి దారి తీసిన పృథ్విరాజ్ చైల్డ్ ఎపిసోడ్ లోని రేప్ సీన్ సైతం ట్రిమ్ చేసినట్టు వినికిడి. ఇవన్నీ బుధవారం నుంచి థియేటర్ స్క్రీనింగ్స్ లో అమలులోకి వస్తాయట. ఎల్2 ఎంపురాన్ బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ నిజమేనని కేరళ రిపోర్ట్. దీని వల్ల తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ వెర్షన్లకు ఒరిగే ప్రయోజనం ఏమి లేదు. మలయాళంలో మాత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ దాటేయగా ఓవర్సీస్ లో ఫైనల్ రన్ లోపు పది మిలియన్ మార్క్ చేరుకుంటుందని అంచనా.
ఇంకో ట్విస్ట్ ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక పృథ్విరాజ్ మీద నమ్మకంతో మోహన్ లాల్ ఫైనల్ కాపీ చూడలేదట. ఒకవేళ ప్రివ్యూ వేసుకుని ఉంటే ముందే కొన్ని సన్నివేశాలను తీయించేవారని ఆయన సన్నిహితుల మాట. లూసిఫర్ సీక్వెల్ గా రూపొందిన ఎల్2 ఎంపురాన్ నెక్స్ట్ మూడో భాగంకు వెళ్తుందా లేదానే అనుమానాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. బ్లాక్ బస్టర్ అయ్యుంటే డిస్కషన్ ఉండేది కాదు కానీ హిందీతో పాటు ఇతర లాంగ్వేజెస్ లో డిజాస్టర్ కావడంతో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పృథ్విరాజ్ మాత్రం ఎల్3 ది బిగినింగ్ తీసే విషయంలో సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. చూడాలి ఏం చేస్తారో.
This post was last modified on March 30, 2025 1:42 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…