సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన సినిమా.. డీజే టిల్లు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం.. సీక్వెల్‌తో ఇంకా పెద్ద సంచలనమే రేపింది. గత ఏడాది వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ ఏకంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. పార్ట్-3 ఇంకా పెద్ద సినిమా కాబోతోంది. టిల్లు అనే పాత్ర పెద్ద బ్రాండుగా మారిందంటే దానికి ‘డీజే టిల్లు’ వేసిన పునాదే కారణం. ఐతే ఇంత పాపులర్ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ అది కాదట. ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరు పెట్టి స్క్రిప్టు రాసిందట సిద్ధు అండ్ టీం. కానీ ఆ టైటిల్ తమకు అసలు వర్కవుట్ కాలేదని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టైటిల్ మార్చాల్సి వచ్చిందని సిద్ధు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘డీజే టిల్లు సినిమాకు ముందు మేం ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ పెట్టాం. ఆ టైటిల్ వేరే వాళ్లు రిజిస్టర్ చేసుకుని ఉంటే.. 4 లక్షల డబ్బు చెల్లించి మరీ ఆ టైటిల్ కొన్నాం. కానీ మా స్నేహితులతో స్క్రిప్టు చర్చలు జరుపుతున్నపుడు ఆ టైటిల్ చెప్పగానే ఇదొక మామూలు సినిమా అనుకుని వినడానికి ఆసక్తి చూపించేవారు కాదు. త్రివిక్రమ్ గారికి ఈ టైటిల్ చెబితే.. ఇదొక మధ్యతరగతి వ్యక్తి జీవిత కథ అనుకున్నారు. దీంతో మేం టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నాం.
ఇందులో హీరో పేరు.. డీజే టిల్లు. దాన్నే టైటిల్‌గా పెట్టాని నిర్ణయించుకున్నాం. అది బాగా వర్కవుట్ అయింది’’ అని సిద్ధు వెల్లడించాడు. తాను కూడా అందరిలాగే బీటెక్ అయ్యాక యుఎస్ వెళ్లాల్సిన వాడినని.. ఒక కన్సల్టన్సీ రూ.20 లక్షలు కడితే యుఎస్ పంపుతామని, అక్కడ చదువుకుంటూ అప్పు తీర్చడానికి బర్గర్ షాప్‌లో పని చేయాలని చెప్పారని.. ఇది నచ్చక తాను సినిమాల్లోనే ప్రయత్నం చేద్దామనుకున్నాని సిద్ధు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
This post was last modified on March 29, 2025 9:42 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…