Movie News

‘ఎంపురాన్’తో పొలిటికల్ చిచ్చు

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. మలయాళంలో కొన్నేళ్ల కిందట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్ కావడం. ప్రోమోలు ఒక రేంజిలో ఉండడంతో సినిమాకు మామూలు హైప్ రాలేదు. కానీ ఈ హైప్‌కు తగ్గట్లు సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. సినిమా బాగా లేకపోవడం పక్కనపెడితే.. ఇందులో కొన్ని సీన్లు ఒక వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించేలా సాగాయి. ముఖ్యంగా ఆరంభంలో ముస్లిం కుటుంబం మీద హిందూ అతివాదులు దాడి చేసే సన్నివేశం తీవ్ర వివాదాస్పదం అయింది.

2002 నాటి గోద్రా అల్లర్లను ప్రతిబింబించేలా ఈ సీన్స్ తీశాడు పృథ్వీరాజ్. అందులో నిండు గర్భిణి అయిన ముస్లిం మహిళ మీద హిందూ అతివాది అత్యాచారం జరిపినట్లు చూపించడం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలో మరి కొన్ని సీన్లు కూడా హిందూ వ్యతిరేక భావజాలంతో సాగడం, మోడీ సర్కారును టార్గెట్ చేసేలా ఉండడంతో బీజేపీ మద్దతుదారులు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘ఎంపురాన్’ను టార్గెట్ చేస్తున్నారు. మోహన్ లాల్ ఇలాంటి సన్నివేశాలను ఎలా ఓకే చేశాడని ప్రశ్నిస్తున్నారు.

ఐతే కేరళకు చెందిన కాంగ్రెస్, వామపక్షాల పార్టీల వాళ్లు అదే స్థాయిలో వారికి బదులిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి ప్రాపగండా సినిమాలు తీసి ప్రయోజనం పొందిన పార్టీ.. ఇప్పుడు ‘ఎంపురాన్’ను ఎలా తప్పుబడుతుందని ప్రశ్నిస్తున్నారు. ‘ఛావా’ సినిమాను సైతం వాళ్లు ప్రస్తావిస్తున్నారు. అందులో చూపించిన ముస్లిం హేట్ సంగతేంటి అని అంటున్నారు. మొత్తంగా కేరళలో ఈ సినిమా రాజకీయంగా రచ్చకు దారి తీస్తోంది. ఐతే ఈ కాంట్రవర్శీలు ఎలా ఉన్నప్పటికీ మిక్స్డ్ టాక్‌తోనే ‘ఎంపురాన్’ భారీ వసూళ్లు సాధిస్తోంది.

This post was last modified on March 29, 2025 2:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

20 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

50 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago