ఉగాది, రంజాన్ పండగల లాంగ్ వీకెండ్ మొదటి అంకానికి తెరలేచింది. మార్చిలో కోర్ట్ తప్పించి చెప్పుకోదగ్గ విజయం సాధించిన సినిమాలేవీ లేకపోవడంతో అందరి దృష్టి కొత్త రిలీజుల మీదుంది. సాంప్రదాయ శుక్రవారానికి భిన్నంగా ఒక రోజు ముందే రెండు డబ్బింగ్ రిలీజులు రావడం ఆసక్తి రేపింది. ఇవాళ రెండు అనువాదాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. వాటిలో మొదటిది ఎల్2 ఎంపురాన్. లూసిఫర్ కొనసాగింపుగా రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం జరిగిన తెలుగు ప్రమోషన్లు మంచి బజ్ తీసుకొచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోటి దాకా గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్.
పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిక్ గా మన ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడంలో డౌట్ లేదు. ప్రీమియర్స్ నుంచి వినిపిస్తున్న మాట సానుకూలంగానే ఉంది కానీ మధ్యాన్నంకి ఒక స్పష్టత వస్తుంది. ఇక విక్రమ్ వీరధీరశూర పార్ట్ 2కి చివరి నిమిషం ఆర్థిక చిక్కుల వల్ల వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ఉదయం 11 గంటల లోపు షోలు పడే పరిస్థితి లేదు. ఇది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపనుంది. అదేం దురదృష్టమో కానీ గత ఏడాది తంగలాన్ కూడా ఇలాంటి సమస్యల్లోనే ఇరుక్కుని ఆలస్యంగా రిలీజైన సంగతి తెలిసిందే. విక్రమ్ కే ఎందుకు ఇలా జరుగుతోందని అభిమానులు తెగ బాధ పడుతున్నారు.
బజ్ విషయానికి వస్తే ఎల్2 ఎంపురాన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో మినహాయించి మిగిలిన చోట పూర్తి డామినేషన్ చూపిస్తున్నాడు. కాకపోతే మన దగ్గర రేపు రిలీజయ్యే మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ టాక్ ని బట్టి ఎల్2 వసూళ్లు రాబట్టడం ఆధారపడి ఉంది. ఒక రోజు అడ్వాంటేజ్ వాడుకుంటూ ఏపీ తెలంగాణలో ఈ ఒక్క రోజే భారీ ఎత్తున స్క్రీన్లు దక్కించుకున్న మోహన్ లాల్ టాక్, రివ్యూస్ కోసం ఎదురు చూడాలి. ఇక ఆదివారం సల్మాన్ ఖాన్ సికందర్ కూడా వస్తోంది. మొత్తానికి సంక్రాంతి తర్వాత ఒకేసారి నాలుగైదు సినిమాలు తెస్తున్న సీజన్ గా మార్చి చివరి వారం ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.
This post was last modified on March 27, 2025 8:10 am
శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు.…
ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…
ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని…
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…
అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకున్న ఎల్2 ఎంపురాన్ కంటెంట్ గురించి అభ్యంతరాలు తలెత్తి దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) - సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య తాజా వివాదం తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. ఉచిత…