Movie News

కీర్తి సురేష్ తక్షణ కర్తవ్యం ఏమిటో

ఇటీవలే పెళ్లి చేసుకుని శ్రీమతిగా మారిన కీర్తి సురేష్ కు బాలీవుడ్ డెబ్యూ ‘బేబీ జాన్’ మాములు షాక్ ఇవ్వలేదు. కొత్త పెళ్లి కూతురనే సంగతి మర్చిపోయి మరీ ప్రమోషన్ల కోసం చెన్నై టు ముంబై నాన్ స్టాప్ గా తిరిగిన మహానటికి హిందీ తెరంగేట్రం డిజాస్టర్ కావడం ఊహించనిది. అట్లీ నిర్మాణం, అందులోనూ తేరి రీమేక్ ఇంకేముంది గ్యారెంటీ హిట్టని ఒప్పేసుకుంది. కట్ చేస్తే ఫలితం రివర్స్ కొట్టింది. తన సోలో సినిమాలు కూడా అంతగా వర్కౌట్ కావడం లేదు. మిస్ ఇండియా, రఘు తాత, గుడ్ లక్ సఖి లాంటి థియేటర్ రిలీజులతో పాటు చిన్ని, పెంగ్విన్ లాంటి ఓటిటి మూవీస్ సైతం తీవ్రంగా నిరాశపరిచాయి.

వీటి దెబ్బకు ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్న ‘రివాల్వర్ రీటా’ విడుదలకు నోచుకోవడం లేదు. ఆగిందో సాగుతోందో కూడా అప్డేట్ లేదు. సుహాస్ తో చేస్తున్న ‘ఉప్పు కప్పురంబు’ ఏ దశలో ఉందో క్లారిటీ లేదు. అయినా సరే కీర్తి సురేష్ కు రెండు క్రేజీ ఆఫర్లు లైన్ లో ఉన్నట్టు టాక్. వాటిలో ఒకటి ఏకంగా రన్బీర్ కపూర్ సరసన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కోసం ప్రతిపాదనలో ఉందట. అయితే అతను రామాయణం, లవ్ అండ్ వార్, యానిమల్ పార్క్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిజంగా సాధ్యమవుతుందానే అనుమానాలు లేకపోలేదు. నూటికి తొంభై శాతం డౌటే కానీ ముంబై సర్కిల్స్ టాక్ అయితే ఉంది.

ఇక రెండోది నితిన్ దర్శకుడు వేణు యెల్దండి కాంబోలో తెరకెక్కబోయే ఎల్లమ్మలో టైటిల్ రోల్. ఇది కూడా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు ఖరారు కావొచ్చని అంటున్నారు. సమంతా లాగా మరీ లేట్ చేయకుండా వీలైనంత వేగంగా సినిమాలు చేయడం కీర్తి సురేష్ కు అవసరం. మహానటితో వచ్చిన ఫేమ్, సర్కారు వారి పాటలో మహేష్ బాబు లాంటి స్టార్ తో జత కట్టిన అవకాశం తన కెరీర్ ని ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేదు. ఇప్పుడు ప్రతిపాదనలో ఉన్నవి కనక ఓకే అయితే మంచి ప్లానింగ్ చేసుకోవచ్చు. పెళ్లయిన భామలకు అసలే ఆఫర్లు తక్కువ. వచ్చిన వాటిని వీలైనంత వాడేసుకుని లాభపడాలి.

This post was last modified on March 26, 2025 8:13 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago